బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్
Your Responsive Ads code (Google Ads)

బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్


బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ధమాకా ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో కస్టమర్లు కేవలం 800 కంటే తక్కువ ఖర్చుతోనే ఒక సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీ పాటుగా డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS సర్వీస్ వంటి ప్రయోజాలను అందుకోవచ్చు. రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్  425 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు. ఈ అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు బీఎస్ఎన్ఎల్L బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog