Ad Code

మేఘాల గుండా వెళ్తున్న గురు గ్రహం !


బృహస్పత్రిపై ఉన్న క్లౌడ్‌ టాప్స్‌ని దగ్గరగా చూసే అవకాశం కల్పించింది నాసా. అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా బృహస్పతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోని రిలీజ్‌ చేసింది. గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జూనో స్పేస్‌క్రాఫ్ట్ ఈ వీడియోను చిత్రీకరించింది. జూనో మిషన్‌కు చెందిన కెమెరాలు ఏప్రిల్ 9వ తేదీన సుమారు 32000 కిలోమీటర్ల దూరం నుంచి గురుగ్రహాన్ని షూట్ చేశాయి. బృహస్పతికి చెందిన దక్షిణ ద్రువాన్ని ఈ వీడియోలో షూట్ చేశారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో గురుగ్రహానికి మరింత దగ్గరగా జూనో వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 ఆగస్టులో జూనో స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగికి పంపారు. 2025 వరకు ఈ మిషన్ పనిచేయనున్నది.

Post a Comment

0 Comments

Close Menu