Ad Code

కొత్త ఫీచర్స్‌తో పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్


టెలిగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించబోతోంది. ఈ నెలలోనే పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్ ఫౌండర్ పవెల్ డురోవ్ అధికారికంగా ప్రకటించారు. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ గురించి తన టెలిగ్రామ్ అకౌంట్‌లో వివరించారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ అయిన టెలిగ్రామ్‌లో ప్రీమియం మెంబర్‌షిప్ ప్రారంభించబోతున్నామని, ఈ నెలలోనే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అసలు సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నామో, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో కూడా వివరించారు. ప్రస్తుతం ఈ యాప్‌లో ఉన్న లిమిట్స్ పెంచాలని చాలామంది యూజర్లు కోరుతున్నారని, వారి డిమాండ్ల మేరకు అనేక రకాలుగా ప్రయత్నించామని, కానీ అందరికీ లిమిట్స్ తీసేస్తే వచ్చే ట్రాఫిక్‌ను సర్వర్లు తట్టుకోవడం కష్టమని, ఇందుకోసం అయ్యే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని పవెల్ డురోవ్ వివరించారు. అందుకోసమే ప్రీమియం మెంబర్‌షిప్   టెలిగ్రామ్  ప్రారంభించబోతోంది. యూజర్లు పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వారికి ఎలాంటి లిమిట్స్ ఉండవు. ప్రస్తుతం టెలిగ్రామ్ గ్రూప్‌లో 2,00,000 మంది వరకు సభ్యుల్ని చేర్చుకోవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో ఈ లిమిట్ ఉండదు. యూజర్లకు ఉచితంగా ఉన్న ఫీచర్స్ అన్ని ఎప్పట్లాగే ఉంటాయని, లిమిట్ పెంచుకోవాలనుకునేవారికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్ ప్రీమియం పేరుతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో అదనపు ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎక్స్‌స్ట్రా లార్జ్ డాక్యుమెంట్స్, మీడియా, స్టిక్కర్స్ లాంటివన్నీ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ప్రీమియం సబ్‌స్క్రపిప్షన్ క్లబ్‌లో చేరేవారికి టెలిగ్రామ్ ఫీచర్స్ ముందుగానే లభిస్తాయి. టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో అదనంగా స్టిక్కర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంత ధరలో ఉంటుందో స్పష్టత లేదు. పబ్లిక్ ఛానెల్స్‌లో యాడ్స్ టెస్ట్ చేస్తున్నామని పవెల్ డురోవ్ తెలిపారు. ఊహించిన దానికన్నా విజయవంతం అయిందని ప్రకటించారు. అయితే ఈ యాప్‌ను యూజర్ల నుంచి వచ్చే డబ్బుల ద్వారా నిర్వహిస్తామని, అడ్వర్టైజర్ల ద్వారా కాదని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu