Ad Code

మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టనున్న ఆర్ ఎక్స్ 100 బైక్స్


ఆర్ ఎక్స్ 100 బైక్ 1985 నుండి 1996 మధ్యలో మర్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ బైక్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇలా జపనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు యమహా భారతీయ మోటార్‌ సైకిల్ మార్కెట్‌లోకి ప్రవేశించడంలో ఆర్ ఎక్స్ 100 ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ బైక్ తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఐషిన్ సిహానా ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. యమహా RX100 మోడల్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురావాలను కుంటున్నట్లు చెప్పారు. అయితే పాత యమహా ఆర్‌ఎక్స్100 మళ్లీ రోడ్డుపైకి రావడం లేదు.  ఎందుకంటే ఇది 2-స్ట్రోక్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దాని ఇంజన్ రీప్లేస్ చేయవచ్చు. డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. యమహా ఏ బైక్‌పైనా ఆర్ ఎక్స్ 100 బ్యాడ్జ్‌ను నిబంధనల ప్రకారం ఇవ్వలేరు. కొత్త ఆర్ ఎక్స్ 100 కోసం.. కంపెనీ ఒక కొత్త బైక్‌ను రూపొందించాలి. దీని కోసం కంపెనీ పాత మోడల్‌లో ఉన్న కొన్ని పార్ట్స్ ను తీసేసి.. రెట్రో డిజైన్ కలయికతో రావచ్చు. ఇది ప్రస్తుతం ఆ కంపెనీకి పెద్ద సవాల్ అనే చెప్పవచ్చు. యమహా 2025 లో కొత్త వాహనాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా.. కంపెనీ 2026 నాటికి యమహా ఆర్ ఎక్స్ 100ని తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం.. యమహా పోర్ట్‌ఫోలియోలో 125 cc స్కూటర్లు, 150 cc స్ట్రీట్ మరియు స్పోర్ట్ మోటార్ బైక్స్ అండ్ 250 cc బైక్‌లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu