దేశీయ మార్కెట్లోకి అమాజ్‌ఫిట్ మరో స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. దీని పేరు అమాజ్‌ఫిట్ జిటిఎస్ 4 మినీ. రూ. 10వేల ధరల విభాగంలో ఫిట్‌నెస్ స్మార్ట్ వాచ్ ఇది. అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంటుంది. కొత్త Amazfit వాచ్‌లో 120 స్పోర్ట్స్ మోడ్‌లు, నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణ, 5 ATM రేటింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అమాజ్‌ఫిట్ GTS 4 Mini 70.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. 1.65-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AoD) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఒక చదరపు డయల్, సిలికాన్ పట్టీలను కలిగి ఉంది. వాచ్ కుడి వైపున ఒకే బటన్ ఉంది. బెజెల్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి. కొత్త Amazfit వాచ్ హుడ్ కింద 270mAh బ్యాటరీని అందిస్తుంది. 15 రోజుల బ్యాటరీ లైఫ్, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 45 రోజుల వరకు అందించగలదని కంపెనీ పేర్కొంది. అమాజ్‌ఫిట్ GTS 4 మినీ 120 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉందని తెలిపింది. 7 స్పోర్ట్స్ మూమెంట్స్‌ను ఆటోమాటిక్‌గా గుర్తించగలదని పేర్కొంది. 5 ATM రేటింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. బ్లడ్-ఆక్సిజన్, హృదయ స్పందన రేటు, ఒత్తిడి స్థాయిలను నిరంతరం మానిటరింగ్ చేయగలదు. Amazfit వాచ్ ఈ 3 విషయాలను ఏకకాలంలో ఒక ట్యాప్‌లో దాదాపు 45 సెకన్లలో ఫలితాలను చూపించగలదు. ప్రతి ఇతర అమాజ్‌ఫిట్ వాచ్ మాదిరిగానే.. ఒకరి ఆరోగ్య స్థితిపై పూర్తి అంచనా వేయడంలో PAI హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే పీరియడ్స్ డేటాను కూడా అందించగలదు. యూజర్లు తమ నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. బ్రాండ్ అమెజాన్ అలెక్సాకు సపోర్టును కూడా అందిస్తుంది.
15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్ !
0
July 14, 2022
Tags