దేశీయ మార్కెట్ లోకి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్ '2022 కటన' స్పోర్ట్స్ బైక్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నట్లు ప్రకటించింది. 999-cm3 పవర్‌ట్రెయిన్‌తో వస్తున్న ఈ మోటార్‌సైకిల్‌కు ఒక జపనీస్ పదం పేరు మీదుగా 'కటన' అనే టైటిల్ ఇచ్చారు. జపనీస్‌లో కటన అంటే కత్తి అని అర్ధం. ఇది సుజుకి ప్రత్యేకంగా రూపొందించిన ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ తో వస్తుంది. వివిధ రకాల అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్.. కస్టమర్లకు బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్ రంగుల్లో ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆటో ఎక్స్‌పోలో సుజుకి ఈ బైక్‌ను ఆవిష్కరించింది. ఆ తర్వాత దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ బైక్ గురించి చాలామంది తమ వద్ద ఆరా తీసినట్లు కంపెనీ తెలిపింది. గత సంవత్సరం మిలన్‌లో జరిగిన 'EICMA షో'లో సుజుకి తాజా 2022 వేరియంట్ కటన బైక్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. దీని లాంచింగ్‌తో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మన దేశంలో తమ పెద్ద బైక్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పోర్ట్స్ బైక్ లాంచింగ్ సందర్భంగా మాట్లాడారు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా. స్పోర్ట్స్ బైక్ లవర్స్ అవసరాలు తీర్చేలా దీన్ని డిజైన్ చేశామని తెలిపారు. ఈ బైక్ ఇండియాలో కూడా కల్ట్ ఫాలోయింగ్‌ను సృష్టించగలదని చెప్పారు. ఈ బైక్ 999cm3 ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, DOHC, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 11,000 RPM వద్ద 112 kW లేదా 152 PS పవర్‌ను.. 9,250 RPM వద్ద 106 Nm టార్క్‌ను అందిస్తుంది. వివిధ రకాల అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండే సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్‌తో ఈ బైక్‌ను ప్రీమియం వెర్షన్‌గా రూపొందించారు. దీంతో పాటు ఈ బైక్ సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రైడ్-బై-వైర్ ఎలక్ట్రానిక్ థ్రాటిల్ సిస్టమ్, లో- RPM అసిస్ట్, సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ (SDMS), సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టమ్ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్.. 5-మోడ్ సెట్టింగ్స్ అందిస్తుంది. ఇది వివిధ రైడింగ్ కండిషన్స్‌కు సరిపోతుంది. ఈ ప్రైజ్ రేంజ్‌లో పోటీ కంపెనీల నుంచి వచ్చిన స్పోర్ట్స్ బైక్స్ కంటే ప్రీమియం ఫీచర్లను సుజుకి అందిస్తోంది.
సుజుకి సూపర్ బైక్ 2022 కటన విడుదల !
0
July 05, 2022
Tags