Ad Code

ఇన్ఫినిక్స్ 32y1 స్మార్ట్ టీవీ ఫస్ట్ సేల్ !


దేశీయ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ ఇండియాలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Infinix 32y1 ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.8,999.  బ్యాంక్ అఫర్ లను కూడా ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ టీవీ పైన అందించింది. బ్యాంక్ అఫర్ తో కొనేవారికి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.8,099 రూపాయలకు లభిస్తుంది. Infinix 32y1 స్మార్ట్ టీవీని ఇండియన్ మర్కెట్లో వున్న బడ్జెట్ ఇతర స్మార్ట్ టీవీలకు గట్టి పోటీని ఇచ్చే ధరలో తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ టీవీ HD-Ready DLED ప్యానెల్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W బాక్స్ స్పీకర్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, YPbPr వీడియో అవుట్పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45 మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 512MB RAM మరియు 4 GB స్టోరేజ్తో స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ టీవీ Linux OS పైన రన్ అవుతుంది మరియు ఇన్ బిల్ట్ Wi-Fi, మిరక్యాస్ట్ తో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu