Ad Code

బిఎస్ఎన్ఎల్ 4G రాకతో ప్రైవేట్ టెల్కోల 5Gపై తీవ్ర ప్రభావం ?


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ని తిరిగి అభివృద్ధి చేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ దేశం మొత్తం మీద 4G రోల్‌అవుట్ మరియు సైట్ అప్‌గ్రేడ్‌ల కాపెక్స్‌ను కూడా కవర్ చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ టెల్కో తన వినియోగదారులకు మరింత వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రైవేట్ టెల్కోలు 5Gకి మారుతున్న సమయంలో బిఎస్ఎన్ఎల్  4Gకి ఎందుకు వెళుతోంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ త్వరలోనే బిఎస్ఎన్ఎల్ 5G NSAని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుండడంతో దానికి 4G కోర్ అవసరం ఎంతైనా ఉంది. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027లో భారతదేశంలోని మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లలో 55% పైగా 4Gని కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంటే ఐదేళ్ల తరువాత కూడా ఎక్కువ మంది వినియోగదారులు 4G మొబైల్ సేవలను ఉపయోగిస్తుఉంటారు. ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌ ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నప్పుడే టెల్కోలు అన్ని కూడా రెండు సార్లు తమ యొక్క అన్ని రకుల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ల యొక్క ధరలను పెంచాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రమే తన ప్లాన్ ల ధరలను పెంచలేదు. ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాలలో ప్రైవేట్ టెల్కోల వినియోగదారులు నెట్‌వర్క్‌ సమస్యలతో బాధపడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కి మాత్రం ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ కోసం నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురుకోలేదు. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే కనుక ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరు తిరిగి బిఎస్ఎన్ఎల్ సిమ్ ని ఎంచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పోటీదారుల కంటే తక్కువ టారిఫ్‌లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించగలదు. బిఎస్ఎన్ఎల్  పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే కొన్ని అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉండే విలువతో మాత్రమే పెరుగుతాయి. బిఎస్ఎన్ఎల్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, 2022న 4G నెట్‌వర్క్‌లను సాఫ్ట్‌గా ప్రారంభించాలని భావిస్తున్నారు. 2022 చివరి నాటికి దేశం మొత్తం మీద విస్తృతంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో BSNL తన 4G నెట్‌వర్క్‌లతో దేశం మొత్తాన్ని కవర్ చేయాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి ప్రభుత్వం USOF ప్రాజెక్ట్‌ల కోసం బిఎస్ఎన్ఎల్ ని కూడా ఎంపిక చేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఇంటి వద్ద పనిచేస్తున్న వినియోగదారులు తమ యొక్క పనిని పూర్తి చేయడం కోసం 4G నెట్‌వర్క్‌ల మీద అధికంగా ఆధారపడ్డారు. 4G నెట్‌వర్క్‌లతోనే తమ పనిని పూర్తి చేయగలిగినప్పుడు అధిక టారిఫ్‌ల వద్ద లభించే 5G నెట్‌వర్క్‌లను ఎంచుకోవడం అనేది కొద్దిగా ఆలోచించే విషయమే. దేశం మొత్తం మీద మారుమూల ప్రాంతాలలో కూడా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లు విస్తరిస్తున్నందున వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వినియోగదారులు అపరిమిత డేటాతో వాటిపై ఆధారపడవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu