ఈనెల 20న రెడ్‌మి కే 50 ఐ 5జీ దేశీయ మార్కెట్లో లాంఛ్ కానుందని కంపెనీ నిర్ధారించింది. జులై 20న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేస్తున్నామని షియామి సబ్ బ్రాండ్ రెడ్‌మి ట్విట్టర్‌లో వెల్లడించింది. చైనాలో లాంఛ్ అయిన రెడ్‌మి 11టిప్రొ+ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మి కే50ఐ 5జీ కస్టమర్ల ముందుకు రానుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌పోన్ 6జీబీ, 8జీబీ ర్యాంతో రెండు వేరియంట్లలో రానుందని సమాచారం. ఇక రెడ్‌మి కే50ఐ 5జీ భారత్‌లో రూ 23,260కు అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెడ్‌మి కే50ఐ 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై ఈ స్మార్ట్‌పోన్ రన్ అవుతుంది. రెడ్‌మి కే50ఐ 5జీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5080ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని అంచనా.
రెడ్‌మి కే50ఐ దేశీయ మార్కెట్లోకి 20న విడుదల
0
July 06, 2022
Tags