శాంసంగ్ ప్రీమియం టీవీలపై బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. టీవీని ఇంటికి తీసుకెళ్లాలంటే ఆ టీవీ ధరలో 70 శాతం అమౌంట్ మొదటగా చెల్లిస్తే సరిపోతుందని. మిగిలిన 30 శాతం ఓ ఏడాది తర్వాత చెల్లించవచ్చని బంపరాఫర్ ఇచ్చింది. నియో QLED, ది ఫ్రేమ్ & క్రిస్టల్ UHD వంటి టీవీలపై ఈ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి 'స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ని శాంసంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ప్రకారం, టీవీని కొనుగోలు చేసేటప్పుడు 70%,12 నెలల తర్వాత మిగిలిన 30% చెల్లిస్తే సరిపోతుంది. పాత టీవీల నుంచి ప్రీమియం శాంసంగ్ టీవీలకు అప్‌గ్రేడ్ కావాలనుకునే వారి కోసమే స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఒకేసారి మొత్తం అమౌంట్ చెల్లించే స్థోమత లేని వారికీ ఈ ప్రోగ్రామ్ ప్రయోజనకరంగా ఉంటుంది. రూ.23,093 చెల్లించి శాంసంగ్ క్రిస్టల్ 4K UHD టీవీ తీసుకెళ్లచ్చు ఈ ప్రోగ్రామ్ కింద, వినియోగదారులు రూ.23,093 ముందస్తు చెల్లింపుగా చెల్లించి, 12 నెలల తర్వాత మిగిలిన రూ.9,897 చెల్లించి శాంసంగ్ క్రిస్టల్ 4K UHD టీవీని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఫ్రేమ్ 2021 సిరీస్ QLED అల్ట్రా HD 4K స్మార్ట్ టీవీని దక్కించుకునేందుకు తొలుత రూ.38,493 చెల్లించి, 12 నెలల తర్వాత రూ.16,497 బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ వినియోగదారులకు టాప్ క్లాస్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవ్వడానికి సహాయపడుతుందని శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ బిజినెస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా అన్నారు. నియో QLED టీవీలో అడ్వాన్స్‌డ్ క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో, న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K, రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 2022లో విడుదలైన శాంసంగ్ నియో QLED టీవీలు స్మార్టర్, ఇంటెలిజెంట్ ఫీచర్లు, చక్కని యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే క్వాలిటీలో వీడియోలను చూసేందుకు, డివైజ్‌లను కంట్రోల్ చేసేందుకు, గేమ్‌లు ఆడటానికి, వర్కౌట్లు చేయడానికి, ఇంకా తదితర పనులకు ఈ టీవీలు బాగా ఉపయోగపడతాయి. ఫ్రేమ్ టీవీ అనేది QLED టెక్నాలజీ, మెరుగైన కాంట్రాస్ట్‌తో లాంచ్ అయింది. ఈ టీవీలో శాంసంగ్ క్వాంటం డాట్ టెక్నాలజీ, క్వాంటం ప్రాసెసర్ 4K, 4K AI అప్ స్కేలింగ్ కేపబిలిటీస్, స్పేస్‌ఫిట్ సౌండ్ వంటివి బెస్ట్ ఫీచర్లుగా నిలుస్తున్నాయి. క్రిస్టల్ 4K UHD టీవీ HDR వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీలో అందించిన మోషన్ Xcelerator Turbo వల్ల గేమింగ్ సమయంలో స్మూత్ మోషన్స్, క్లియర్ ఇమేజెస్ పొందవచ్చు. అలాగే, ఈ కొత్త టీవీ మోడల్‌లు యూనివర్సల్ గైడ్, గేమ్ మోడ్, ట్యాప్ వ్యూ, శాంసంగ్ టీవీ ప్లస్, పీసీ ఆన్ టీవీ వంటి ఉపయోగకరమైన ఫీచర్లను యూజర్లకు ఆఫర్ చేస్తాయి.
70% అమౌంట్ మొదట చెల్లించి టీవీ తీసుకెళ్లండి !
0
July 02, 2022
Tags