Ad Code

80 కిలోల బరువును మోసే నీటి కలువ ఆకులు !


లండన్, బొలీవియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా మనిషి తలకంటే పెద్ద పువ్వులు, 3.2 మీడల్ల వెడల్పుతో 80 కిలోల బరువును మోసే ఆకులతో ప్రపంచంలోనే  అతి పెద్ద నీటి కలువ మొక్కను కనుగొన్నారు. ఈ కొత్త జాతి లిల్లీకి ‘విక్టోరియా బొలీవియానా’ అని పేరు పెట్టారు. ఇది నీటి కలువ మూడో జాతి. ఈ నీటి కలువ ఆకులు శిశువు బరువును మోసేంత పెద్దవిగా ఉన్నాయని యూకేలోని క్యూ గార్డెన్స్‌కు చెందిన నటాలియా ప్రజెలోమ్స్కా చెప్పారు. అదే సమయంలో సిద్ధాంతపరంగా చూస్తే బరువు సమానంగా విభజించినప్పుడు 80 కిలోల వ్యక్తి దీనిపై కూర్చున్న అణిగిపోకుండా ఉంటుందని నటాలియా తెలిపారు. 2016లో బొలీవియాలోని శాంటా క్రూజ్ లే డా సియెర్రా బొటానిక్ గార్డెన్స్, లా రింకోనాడా గార్డెన్స్ క్యూ గార్డెన్స్‌లో ఈ నీటి కలువ విత్తనాలను పెట్టారు. ఉద్యానవన శాస్త్రవేత్త కార్లోస్ మాగ్డలీనా ఈ విత్తనాలను విత్తారు. అవి పెరిగిన తర్వాత లిల్లీలను చూసి కార్లోస్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇవి ఇతర లిల్లీల పోల్చితే భిన్నంగా ఉన్నట్లు గుర్తించాడు. ‘విక్టోరియా బొలివియానా’ మంచినీటిలో వికసిస్తుంది. ఇది బొలీవియాలోని ఈశాన్య ప్రాంతంలో కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ దాని కోసం శోధిస్తున్నారు. ఈ లిల్లీ పెద్ద ఆకుల వల్లే ఇతర చెట్ల కంటే సూర్యరశ్మిని సులభంగా పొందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ జాతి లిల్లీ ఎక్కడైనా చాలా త్వరగా పెరుగుతుందని ప్రజెలోమ్స్కా చెప్పారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రదేశంలో ఈ వాటర్ లిల్లీ ఎక్కువగా పెరుగుతుందని తెలిపారు. సూర్యరశ్మిని ఎక్కువగా తీసుకొని మిగిలిన మొక్కలకంటే ఎక్కువగా ఎదుగుతాయని పేర్కొన్నారు. కలువ జాతి అంతరించిపోయే దశలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇతర రెండు వాటర్‌ లిల్లీల కంటే చాలా తక్కువ ప్రదేశాల్లో కనిపిస్తుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులను నరికివేయడం వల్ల ఈ మూడు జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu