Ad Code

స్మార్ట్ ఫోన్ నీటిలో పడితే తీసుకోవలసిన జాగ్రత్తలు !


మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. నిత్యం ఫోన్ మనతోనే ఉంటుంది కాబట్టి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి నీటిలో పడుతుంది. లేదా వర్షపు నీటిలో తడుస్తుంది. మొబైల్‌లోకి వాటర్ చేరితే స్క్రీన్ రంగులు మారుతూ ఉంటుంది. టచ్ ప్యాడ్ సరిగా పనిచెయ్యదు. నీటిలో పడిన, తడిసిన ఫోన్ల విషయంలో మొబైల్ కంపెనీలు కూడా తమకు సంబంధం లేదని చెబుతాయి. ఇలాంటి సమయంలో నిరాశ పడకుండా కొన్ని చర్యలు తీసుకుంటే మొబైల్ తిరిగి పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనుకోకుండా ఫోన్ నీటిలో పడితే ఎట్టి పరిస్థితిల్లోనూ ఆన్ చేయకూడదు. బటన్లను వత్తడం చేయకూడదు. ఫోన్‌ను షేక్ చేయటం చేయకూడదు. మీకు తెలియకుండా ఫోన్‌ను ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల ఫోన్‌ వారంటీ కోల్పొవల్సి వస్తుంది. తడిచిన ఫోన్ పై గాలిని ఊదే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల నీళ్లు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మీకు అవగాహన లేకుండా ఏ విధమైన హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. కొద్ది సేపటి తర్వాత ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌లను తొలగించాలి. అలానే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని సున్నితంగా ఫోన్‌లోని తడి ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయలి. తడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వాక్యుమ్‌ను ఉపయోగించి డివైస్‌ను డ్రై అయ్యేలా ప్రయత్నించాలి. ఫోన్ తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో ఫోన్‌ను రెండు రోజుల పాటు కప్పి ఉంచాలి. ఇలా గాలికూడా చొరబడలేని బిగుతైన వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల ఏదైనా తడి ఉంటే ఆవిరైపోతుంది. చాలా సందర్భాల్లో మొబైల్ నీటిలో పడిన తర్వాత, వాన నీటిలో తడిసిన ఐదు నిమిషాల లోపు నీరు తీసేస్తే… తిరిగి పనిచేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ చాలా వరకూ బాగా పనిచేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu