వాట్సాప్ యాప్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే ఇంతటి క్రేజ్. పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలోనే వాట్సాప్ ఇటీవల వరుస పెట్టి కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా స్టేటస్‌లో వీడియోలు, ఫొటోలు, టెక్ట్స్‌లను పోస్ట్ చేస్తుండడం మనందరికీ తెలిసిందే. అయితే వాట్సాప్ ఇప్పుడు దీనికి కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదే ఇకపై యూజర్లు తాము స్వయంగా రికార్డ్ చేసిన ఆడియోను నేరుగా స్టేటస్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్ కాస్ట్‌లకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. నచ్చిన ఫొటో లేదా వీడియోను పోస్ట్ చేసి దానిపై ఆడియో రూపంలో కామెంట్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ బార్‌ను క్లిక్ చేయగానే కెమెరా, టెక్ట్స్ ఫీచర్లు కనిపిస్తున్నాయి కదూ.. అయితే ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియో స్టేటస్ పోస్ట్ చేసేందుకు వీలుగా మైక్ సింబల్ కనిపిస్తుంది. దీంతో నేరుగా వాయిస్ రికార్డ్ చేసుకొని స్టేటస్‌లో పోస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాట్సాప్ యూజర్లకు త్వరలో పాడ్ కాస్ట్ ఆప్షన్ ?
0
July 15, 2022