Ad Code

చైనా రాకెట్ శకలాలు ఫిలిప్పీన్స్‌ సముద్రంలో పడ్డాయ్ !


అంతరిక్షంలో ముక్కలుగా విరిగిపోయిన చైనా లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్‌కు సంబంధించిన శకలాలు ఇవాళ ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయి. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 12.55 గంటలకు శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించిన అనంతరం కాలిపోయాయని చైనా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. 119 డిగ్రీల తూర్పు రేఖాంశం, 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఈ శకకాలు పడ్డాయని వివరించింది. ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రావిన్స్‌లోని ప్యూర్టో ప్రిన్సెసాలోని సముద్రంలో ఆ శకలాలు పడ్డాయి. అయితే, ఈ విషయంపై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్‌ను చైనా ఈ నెల 24న ప్రయోగించింది. ఆ శకలాలు భూమి వైపునకు వేగంగా దూసుకు రావడంతో అవి ఏ సమయంలో ఎక్కడ పడతాయోనని కొన్ని రోజులుగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ శకకాలు ఏ దిశగా వస్తున్నాయో కూడా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఆ శకాల దిశను మార్చేందుకు కూడా సాధ్యపడలేదు. వాటి శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించడంతో ఆందోళన మరింత పెరిగింది. వాటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల ప్రజలకు ఇవి కనపడ్డాయి. గత రాత్రి హిందూ మహాసముద్రంపై భూవాతావరణంలోకి చైనా రాకెట్‌ శకలాలు ప్రవేశించాయని అమెరికా కూడా నిర్ధారించింది. చివరకు అవి ఇవాళ ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయని చైనా ప్రకటన చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చైనా నిర్మించాలనుకుంటోన్న స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికిగాను ల్యాబరేటరీ మాడ్యూల్‌ను ఆ దేశం తరలించింది. ఇందులో భాగంగా చేస్తోన్న రాకెట్ ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో చైనా స్పేస్‌ ఏజెన్సీ తీరుపై నాసా శాస్త్రవేత్తలు విమర్శలు చేస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu