Ad Code

భూమి వైపు దూసుకువస్తున్న భారీ తోకచుక్క


భారీ తోకచుక్క భూమి వైపుగా దూసుకువస్తున్నది. ఈ నెలలో భూ గ్రహానికి దగ్గరగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం ధ్రువీకరించింది. ఇప్పటి వరకు గుర్తించిన తోకచుక్కల్లో యాక్టివ్‌గా ఉన్న వాటిల్లో ఇది కూడా ఒకటి. హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఈ తోకచుక్కను 2017లో గుర్తించింది. సాటర్న్‌, యురేనస్‌ కక్షల మధ్య 2017లో తొలిసారిగా దీన్ని గుర్తించి, దీనికి కే2 నామకరణం చేశారు. దాదాపు 18 కిలోమీటర్ల వెడెల్పు ఉన్న తోకచుక్క ప్రస్తుతం అంగారక గ్రహాన్ని దాటుకొని ఎట్టకేలకు భూమి వైపుగా వస్తోందని నాసా పేర్కొంది. అయితే, ఈ నెల 14న భూమికి అత్యంత సమీపంలోకి చేరుకుంటుందని, ఆ సమయంలో తోకచుక్క భూమి నుంచి దాదాపు 168 మిలియన్‌ మైళ్ల దూరంలో (270 మిలియన్‌ కిలోమీటర్లు) నుంచి దూసుకు వెళుతుందని నాసా పేర్కొంది. టెలిస్కోప్‌ సహాయంతో ఈ భారీ తోకచుక్కను చూడవచ్చని పేర్కొంది. డిసెంబర్‌ నాటికి సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్తుందని పేర్కొంది. అయితే, తోకచుక్కను చూసేందుకు 14న సాయంత్రం 6.15 (2215 GMT) గంటల సమయంలో space.com ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.

Post a Comment

0 Comments

Close Menu