Ad Code

ఓలా నుంచి స్పోర్ట్స్ కారు ?


ఓలా కంపెనీ ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఎటర్గో స్కూటర్ కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి కొత్త ప్రొడక్ట్స్‌ తయారీపై దృష్టి సారించింది. ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీని 2020 డిసెంబర్‌లో తమిళనాడులో ఏర్పాటు చేశారు. కేవలం ఒకటిన్నర సంవత్సరాలలో, ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎలా ఉండాలో రీడిఫైండ్‌ చేసింది. తాజాగా భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓలా కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఓలా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. వరుస ట్వీట్లలో, S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సక్సెసర్‌గా రాబోయే MoveOS 3 అప్‌డేట్ గురించి కూడా అగర్వాల్ వివరించారు. భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్‌లో.. 'భారతదేశంలో ఇప్పటివరకు తయారు చేయని స్పోర్ట్స్ కారును మేము తయారు చేయబోతున్నాం.' అని రాశారు. రాబోయే అప్‌డేట్ MoveOS 3లో మూడ్స్ ఫీచర్‌ను టెస్ట్ చేసిన ఒక వీడియోను కూడా ట్విట్టర్‌ ప్లాట్‌ఫారమ్‌లో పంచుకున్నారు. ఆయన చేసిన మరొక ట్వీట్‌లో.. 'రాబోయే అప్‌డేట్‌ను దీపావళి సందర్భంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఈ సంవత్సరం దీపావళి రోజున అందరి కోసం MoveOS 3 లాంచ్‌ అవుతుంది. MoveOS 2 అందరికీ ఎక్సైట్‌మెంట్‌ కలిగించింది, అయితే MoveOS 3ని అనుభవించే వరకు వేచి ఉండండి' అని పేర్కొన్నారు. హిల్ హోల్డ్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, మూడ్స్, రీజెన్ v2, హైపర్‌చార్జింగ్, కాలింగ్, కీ షేరింగ్, అనేక కొత్త ఫీచర్‌లను, ప్రపంచ స్థాయి టెక్నాలజీని వీలైనంత త్వరగా వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఓలా ఇంజినీరింగ్‌కు గర్వకారణం అని ఆయన చెప్పారు. 2022 మార్చిలో.. ఎలక్ట్రిక్‌ బ్యాటరీ టెక్నాలజీలలో ప్రత్యేకత కలిగిన ఇజ్రాయెల్ ఆధారిత సంస్థ అయిన స్టోర్‌డాట్‌లో ఓలా పెట్టుబడులు పెట్టింది. రెండు కంపెనీలు సంయుక్తంగా XFC (ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్) బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఎక్స్‌యూవీ700, థార్, ఎక్స్‌యూవీ300లను డిజైన్ చేసిన మాజీ మహీంద్రా డిజైనర్ రామ్‌కృపా అనంతన్ ఓలా టీమ్‌లో చేరినట్లు కూడా సమాచారం. ఓలా నుంచి మినిమలిస్ట్, ఇంకా టెక్కీ వాహనాన్ని ఆశించవచ్చు. పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది. బ్యాటరీలు స్వదేశీ పద్ధతిలో రూపొందిస్తున్నారు. మరోవైపు, ఓలా ఖర్చులను తగ్గించుకోవడం కోసం, నిధుల కొరతతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా 500 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని ఇటీవలి ఓ నివేదిక పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సాఫ్ట్‌బ్యాంక్‌ సపోర్ట్‌ ఉన్న ఓలా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తమ టీమ్‌లలో పనితీరు ప్రాతిపదికన ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తీసివేయాలనే వివరాలను కోరినట్లు తెలిసింది. పనితీరు ప్రాతిపదికన ఉద్యోగులను తొలగించాలనే యోచనలో ఉందని సమాచారం ఉంది. కంపెనీ తన బలమైన ప్రాఫిటబిలిటీ చెక్కుచెదరకుండా ఉంచడానికి లీనర్, టీమ్స్‌ను చూస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu