ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ తప్పుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కొనుగోలుపై తనకు సమస్యలు సృష్టిస్తున్నారంటూ మస్క్ ట్విట్టర్ సీఈఓకు వార్నింగ్ మెసేజ్ పంపాడు. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలను కోరుతూ కంపెనీ న్యాయవాదులు తనకు లేనిపోని ట్రబుల్స్ క్రియేట్స్ చేస్తున్నారని మస్క్ మండిపడుతున్నాడు. ఈ డీల్ నుంచి తప్పుకునే ముందు ట్విట్టర్ సీఈఓకు మస్క్ టెక్స్ట్ మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం దాఖలు చేసిన దావాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్ డీల్‌కు సంబంధించి నిధుల సమీకరణ డేటా ఆధారంగా కంపెనీ న్యాయవాదులు తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని కోరుతూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెడ్ సెగల్‌కు మస్క్ జూన్ 28న టెక్ట్స్ మెసేజ్‌లు పంపినట్టు ప్రస్తావించారు. ట్విట్టర్ డీల్‌ను ఎలా పూర్తి చేస్తారు.. నిధుల సమీకరణ వివరాలపై మస్క్‌ను అడిగిన అనంతరం మస్క్ ఈ వార్నింగ్ మెసేజ్‌లను అగర్వాల్, సెగల్‌కు పంపినట్టు తెలుస్తోంది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మాస్క్ వైదొలడంపై ఎవరికి సమస్యగా అనిపించలేదు. ఈ ఒప్పందంపై మస్క్‌కు ఆసక్తి లేదని పలు ట్వీట్ల ద్వారా సంకేతాలు పంపారు. ట్విట్టర్ ఒప్పందాన్ని నిలిపివేసినట్టు మస్క్ తొలుత ట్వీట్ చేశారు. భారీ డీల్‌పై స్పామ్ బాట్స్‌పై డేటాను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైతే ఆ డీల్ నుంచి వెంటనే వైదొలగుతానని ఎలన్ మస్క్ హెచ్చరించారు. ఈ డీల్ నుంచి మస్క్ వైదొలగకుండా ఉండేందుకు ట్విట్టర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫేక్, స్పామ్ అకౌంట్ల గురించి ట్విట్టర్ తనకు ఖచ్చితమైన డేటాను అందించలేదని మస్క్ ట్విట్టర్ డీల్ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అకౌంట్లను గుర్తించడం, సస్పెండ్ చేయడం వంటి సమాచారాన్ని ట్విట్టర్ అందించలేదని మస్క్ ఆరోపించారు.
పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మాస్క్ వార్నింగ్ మెసేజ్..!
0
July 15, 2022
Tags