Ad Code

టెలిగ్రామ్ లో సీక్రెట్‌ చాటింగ్ కి సరికొత్త ఫీచర్‌!


దేశంలోని యువత చాలా వరకు టెలిగ్రామ్ యాప్ కి బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ ఎప్పటికప్పుడు తమ విషయాల్ని మిత్రులు, లేదా కుటుంబసభ్యులతో పంచుకోవడానికి టెలిగ్రామ్ బాగా ఉపయోగడుతోంది. ఈ క్రమంలో దీని వినియోగం బాగా పెరిగింది. కాగా, టెలిగ్రామ్ యాప్ ఇటీవల సరికొత్త సీక్రెట్ మెసేజ్‌ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. అదేంటంటే మీరు ఎవరైనా మీ సన్నిహితులతో సీక్రెట్‌గా ఛాట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. యూజర్లు తమ చాట్ విషయంలో ప్రైవసీ పాటించాలనుకుంటే అలాంటి వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎంత మందితో అయితే సీక్రెట్ చాట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి మాత్రమే దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మిగతా కాంటాక్ట్స్ అందరితో కామన్ చాట్ చేసుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న ప్రొఫైల్‌కు సీక్రెట్ చాట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి మీరు పంపిన చాట్ ఎన్ని క్షణాల్లో(సెకన్లలో) డిసప్పియర్ లేదా డిస్ట్రక్ట్‌ కావాలనే విషయంలో మీరే నిర్దిష్టమైన సమయాన్ని కూడా అసైన్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు అవతలి వ్యక్తికి చేసిన మెసేజ్‌లు నిర్దేశించిన సమయంలో మీతో పాటు ఆ వ్యక్తి మాత్రమే చూడగలరు. మీ నిర్దేశిత సమయం అనంతరం ఆ చాట్ డిసప్పియర్ అవుతుంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా పని చేస్తుంది. అంతేకాకుండా ఒకవేళ్ మీరు మెసేజ్ పంపిన వెంటనే స్వయంగా ఆ దాన్ని డిలీట్ చేస్తే ఇద్దరికీ డిలీట్ అవుతుంది. ఈ సీక్రెట్ చాట్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ యాప్ లేని వాళ్లు ఆండ్రాయిడ్ యూజర్ అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యూజర్ అయితే యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎవరితో సీక్రెట్ చాట్ చేయాలి అనుకుంటున్నారో వారి చాట్‌ కాంటాక్ట్ ఎంపిక చేసుకుని, వారి ప్రొఫైల్ లోకి వెళ్లాలి. తరువాత వారి ప్రొఫైల్ లో కుడి వైపు పై భాగంలో మూడు డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్‌పై క్లిక్ చేస్తే మనకు పలు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో సీక్రెట్ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంపిక చేసిన ఆ కాంటాక్ట్ తో మీ సీక్రెట్ చాట్ యాక్టివేట్ అవుతుంది.ఆ వ్యక్తికి మీరు పంపే మెసేజ్ ఎంత సమయంలో డిసప్పియర్ లేదా డిస్ట్రక్ట్ కావాలో మీరే సమయాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలా మీరు నిర్దిష్ట సమయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మీరు అవతలి వ్యక్తితో చేసే చాట్ ఆ నిర్దిష్ట సమయం తర్వాత ఇక కనిపించదు.

Post a Comment

0 Comments

Close Menu