Ad Code

బీజీఎమ్ఐ మొబైల్ గేమ్‌పై బ్యాన్ !


'పబ్‌జి'కి ఇండియన్ వెర్షన్‌గా రూపొందిన 'బీజీఎమ్ఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)'పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గూగుల్, యాపిల్ సంస్థలు తమ ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్‌లపై నుంచి ఈ గేమ్‌ను తొలగించాయి. గురువారం నుంచి ఈ గేమ్ యూజర్లకు అందుబాటులో లేకుండా పోయింది. రెండేళ్లక్రితం దేశంలో పబ్‌జిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి పబ్‌జి లాంటి అనేక గేమ్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బీజీఎమ్ఐ ఒకటి. ఇది ప్రత్యేకంగా మొబైల్ గేమ్. ఈ గేమ్ గత ఏడాది జూలై 2న విడుదలైంది. ఈ గేమ్ బాగా సక్సెస్ అయ్యింది. లక్షలాది మంది గేమర్స్ దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆడారు. క్రాఫ్టాన్ అనే సంస్థ ఈ గేమ్ రూపొందించింది. ఇది పబ్‌జిలాగే ఉండటంతో త్వరగా ఆదరణ పొందింది. తయారీ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్ తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంది. 100 మిలియన్ డాలర్లను క్రాఫ్టాన్ సంస్థ గేమ్ కోసం వెచ్చించింది. ఇటీవలే ఈ గేమ్ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. మరిన్ని కొత్త వెర్షన్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ఈమధ్యే ప్రకటించింది. అంతలోపే వివిధ కారణాలతో గేమ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై క్రాఫ్టాన్ సంస్థ ఇంకా స్పందించలేదు.

 

Post a Comment

0 Comments

Close Menu