Ad Code

నథింగ్‌కు పోటీగా సమ్‌థింగ్ !


గ్లోబల్ మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న మొబైల్ నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్ కన్నా విభిన్నమైన డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు నథింగ్‌కు పోటీగా సమ్‌థింగ్ అనే పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కాదు. ఓ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్ కేస్‌లను సమ్‌థింగ్ పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లకు స్కిన్స్, కేసెస్ తయారు చేసే బ్రాండ్స్ చాలా ఉన్నాయి. dbrand పేరుతో ఓ కంపెనీ ఉంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు స్కిన్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఇటీవల నథింగ్ ఫోన్ 1 డిజైన్ అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కంపెనీ కొత్త ప్రయోగం చేసింది. నథింగ్ ఫోన్ 1 డిజైన్‌ను తకలపించేలా స్కిన్స్, కేసెస్ తయారు చేసింది. వేర్వేరు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కి వీటిని రూపొందించింది. ఐఫోన్, సాంసంగ్, గూగుల్ పిక్సెల్‌తో పాటు ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు కస్టమైజ్డ్ స్కిన్స్, కేసెస్ అందిస్తోంది. వీటి ధరలు రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారు స్కిన్స్, కేసెస్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. అయితే ఇటీవల నథింగ్ ఫోన్ 1 గ్లిఫ్ డిజైన్ పాపులర్ కావడంతో ఈ కంపెనీ అలాంటి కేసెస్, స్కిన్స్ తయారు చేసింది. Something పేరుతో వాటిని ప్రమోట్ చేస్తోంది. ఇలా చేయడం తప్పేమీ కాదని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. నథింగ్ నుంచి తాము ఏమీ దొంగిలించలేదని, స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ హార్డ్‌వేర్ చెక్ చేసి అందుకు తగ్గట్టుగా కేసెస్, స్కిన్స్ తయారు చేశామని వివరించింది. నథింగ్ లాంటి డిజైన్‌ను తాము ఇతర స్మార్ట్‌ఫోన్లకు అందించగలుగుతున్నామని తెలిపింది. ఇది దొంగిలించడం కాదని, ఇది ప్లాగరిజమ్ అని, ఇదేమీ క్రైమ్ కూడా కాదని క్లారిటీ ఇచ్చింది.  నథింగ్ ఫోన్ 1 విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందర్నీ ఆకట్టుకున్నది గ్లిఫ్ డిజైన్. స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఉంటుంది. 900 ఎల్ఈడీస్ ఉంటాయి. కాల్స్, సిగ్నల్స్, ఛార్జింగ్ స్టేటస్ ఈ లైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోటోలు క్లిక్ చేసేప్పుడు ఫ్లాష్ లైట్‌గా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంటే నోటఫికేషన్స్, కాల్స్ వచ్చినప్పుడు ఈ లైట్స్ ద్వారా తెలుస్తుంది. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్ రూ.32,999 ధరకు, 8జీబీ+256జీబీ మోడల్ రూ.35,999 ధరకు, 12జీబీ+256జీబీ మోడల్ రూ.38,999 ధరకు లాంఛ్ అయింది. 

Post a Comment

0 Comments

Close Menu