Ad Code

ఫేస్ బుక్ లో టిక్ టాక్ ?


ఫేస్‌బుక్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు టిక్‌టాక్‌ తరహాలో కొత్త ప్రణాళిక రూపొందించింది. కంటెంట్‌ క్రియేటర్‌లు ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో పోస్ట్‌ల రూపంలో కంటెంట్‌ షేర్‌ చేసుకునేలా ఫేస్‌బుక్‌ డిజైన్‌లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. 'యూజర్ల డీఫాల్ట్‌ స్క్రీన్‌ హోమ్ పేజ్‌లో అవుట్ సైడ్‌ క్రియేటర్స్‌ నుంచి మోస్ట్‌ ఎంటర్‌ట్రైనింగ్‌ పోస్ట్‌లు కనిపిస్తాయి. షార్ట్‌ వీడియో సర్వీస్‌ రీల్స్‌, స్టోరీస్‌కి ఈజీ యాక్సెస్‌ ఉంటుంది.' అని పేర్కొంది. న్యూ ఫీడ్స్‌ ట్యాబ్‌ కింద ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫేవరెట్‌ పేజెస్‌ నుంచి రీసెంట్‌ పోస్ట్‌లు చూడవచ్చని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఎక్కువగా పోస్ట్‌లు చూడాలనుకునే ఫ్రెండ్స్‌, ఫేవరెట్‌ పేజ్‌లతో 'ఫేవరెట్స్‌ లిస్ట్‌' క్రియేట్‌ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది కొత్త అప్‌డేట్ల గురించి ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఓ పోస్ట్‌లో తెలిపారు. 'యాప్‌లో ఇప్పటికీ హోమ్ ట్యాబ్‌లో పర్సనలైజ్డ్‌ కంటెంట్‌ కనిపిస్తుంది. సంబంధిత యూజర్‌కి ఇష్టమైన కంటెంట్‌ను డిస్కవరీ ఇంజిన్ సిఫార్స్‌ చేస్తుంది. కానీ ఫీడ్స్‌ ట్యాబ్ బెస్ట్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి కస్టమైజ్‌, కంట్రోల్‌ చేసే అవకాశం కల్పిస్తుంది.' అని తెలిపారు. గత సంవత్సరం ఫేస్‌బుక్‌ పేరు మెటాగా మారింది. ప్రస్తుతం ByteDance వీడియో-షేరింగ్ యాప్, టిక్‌టాక్‌కి పోటీగా నిలిచేందుకు వీడియో ప్రొడక్ట్స్‌పై పెద్ద మొత్తంలో ఫేస్‌బుక్‌ నిధులు వెచ్చిస్తోంది. పర్సనలైజ్డ్‌ షార్ట్‌, ఎంగేజింగ్‌ వీడియో ఫీచర్‌లతో టిక్‌టాక్‌ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంగా నిలిచింది. ఇదే తరహా రీల్స్‌పై ఖర్చు చేయడం, యూజర్లను ఆకట్టుకోవడం, ఆదాయాలను పెంచుకోవడం కంపెనీ ప్రధాన లక్ష్యమని, దానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని జుకర్‌బర్గ్ వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu