Ad Code

సొంత రికార్డును బద్దలు కొట్టిన స్పేస్ఎక్స్ !


అమెరికాలోని ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘స్టార్‌లింక్’ ద్వారా గత ఏడాది మొత్తం కలిపి 31 రాకెట్ల ప్రయోగం చేశారు. ఇప్పుడు గత ఏడాది నెలకొల్పిన ఆ సొంత రికార్డును స్పేస్ఎక్స్ బద్దలు కొట్టింది. నిన్న స్పేస్ఎక్స్ 'ఫాల్కన్-9' రాకెట్ ద్వారా 46 స్టార్ లింక్ శాటిలైట్లను భూ నిమ్న కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. స్పేస్ఎక్స్ ఈ ఏడాది చేపట్టిన 32వ మిషన్ ఇది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తమ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్పేస్ఎక్స్ నిన్న కాలిఫోర్నియాలోని తమ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను నింగికి పంపింది. రానున్న నెలల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనుంది. స్పేస్ఎక్స్ ఇప్పటివరకు మొత్తం కలిపి దాదాపు 3 వేల స్టార్ లింక్ శాటిలైట్లను అంరిక్షానికి పంపింది. గత ఏడాది డిసెంబరులో కూడా స్పేస్ఎక్స్ 'ఫాల్కన్-9' రాకెట్ ద్వారా ఒకేసారి 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ పేరుతో భూ నిమ్న కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లో చిన్నపాటి ఉపగ్రహాలను స్పేస్ఎక్స్‌ ప్రవేశపెడుతూ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. వేలాది చిన్నపాటి శాటిలైట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలనుకూడా అనుసంధానం చేసేందుకు స్పేస్ఎక్స్ కృషి చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu