Ad Code

ఒప్పో భారీ పెట్టుబడులు


దేశంలో తాజా పెట్టుబడులపై ఒప్పో దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్‌తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది. దేశంలో 500 కోట్ల డాలర్ల వార్షిక ఎగుమతి సామర్ధ్యం చేరుకునేందుకు ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయని ఒప్పో పేర్కొంది. ఈ వ్యవధిలో 5జీ, ఏఐ వంటి నూతన శ్రేణి టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరిస్తామని, భారత్‌లో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తామని కంపెనీ తెలిపింది. కాగా రూ 4389 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేపడుతున్న సమయంలో ఒప్పో భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించడం గమనార్హం. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఒప్పో చెబుతోంది. పలు మార్కెట్లలో మేకిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతిని ప్రోత్సహించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని ఒప్పో ఇండియా పబ్లిక్ ఎఫైర్స్ వైస్‌ప్రెసిడెంట్ వివేక్ వశిష్ట వెల్లడించారు.


Post a Comment

0 Comments

Close Menu