Ad Code

మెటీరియల్ యు రీడిజైన్‌ ?


జీమెయిల్  వెబ్ యాప్‌లో సరికొత్త డిజైన్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో మెటీరియల్ యు రీడిజైన్‌ను అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ జీమెయిల్ ఇంటర్‌ఫేస్ లుక్‌ను డిజైన్ లాంగ్వేజ్‌గా మార్చేసి ఒక దగ్గర నుంచే అనేక యాప్స్ యాక్సెస్ చేసేలా వీలు కల్పించింది. ఈ రీడిజైన్ లుక్ మరికొద్ది వారాల్లోనే జీమెయిల్ యూజర్లందరికీ రిలీజ్ కానుంది. కొత్త రీడిజైన్‌లో కొత్త సైడ్ ప్యానెల్ కనిపిస్తోంది. ఈ ప్యానెల్‌లో మెయిల్, చాట్, స్పేసెస్, మీట్ వంటి యాప్స్ కనిపిస్తున్నాయి. వీటిపై నొక్కడం ద్వారా ఈజీగా ఆ యాప్స్‌ యాక్సెస్ చేయొచ్చు. "ఇంటిగ్రేటెడ్ వ్యూ" అని పిలిచే వ్యూలో సైడ్ ప్యానెల్ ఐకాన్‌లపై క్లిక్ చేయడం ద్వారా యాప్‌లను యూజ్ చేసుకోవచ్చు. ఈ వ్యూ నచ్చని వారు క్విక్ మెనూలోకి వెళ్లి ఓల్డ్ వ్యూకి చేంజ్ కావొచ్చు. ఎవరైతే యూజర్లు తమ జీమెయిల్ అకౌంట్స్‌లో చాట్ యాప్ లాంచ్ చేస్తారో వారికి మాత్రమే ఇంటిగ్రేటెడ్ వ్యూ అందుబాటులో ఉంటుందని తాజాగా గూగుల్ వెల్లడించింది. గూగుల్ కొత్త ఫిల్టర్ బటన్లను కూడా తీసుకొచ్చింది. ఈ ఫిల్టర్ బటన్లు ఈ-మెయిల్స్ లిస్ట్‌ పైభాగంలో కనిపిస్తాయి. సెర్చ్ చేస్తున్నప్పుడు కావాల్సిన మెయిల్‌ను ఇన్‌బాక్స్‌లో చాలా త్వరగా కనుగొనేందుకు ఇవి ఉపయోగపడతాయి. "సెర్చ్ చిప్స్" అని పిలిచే ఈ కొత్త ఫిల్టర్లు గతంలో సెర్చ్ బార్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు సెర్చ్ బార్ పైన కనిపిస్తున్నాయి. "హ్యజ్‌ అటాచ్‌మెంట్", "ఇజ్‌ అన్‌రీడ్" వంటి ఫిల్టర్లను ఉపయోగించి కావాల్సిన వర్గానికి చెందిన మెయిల్‌లను సెర్చ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతాయి. ఇన్‌బాక్స్‌లో మరింత త్వరగా సెర్చింగ్ జరపడానికి అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ను కూడా వాడవచ్చు. మెయిల్ కోసం సెర్చ్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఫిల్టర్లు పై భాగంలో చాలా చక్కగా ఒక వరుసలో కనిపిస్తాయి. తద్వారా ఎక్కువగా టైప్ చేయకుండా ఈ ఫిల్టర్ బటన్స్ ని ఎంచుకొని త్వరగా సెర్చ్ పూర్తి చేయవచ్చు. జీమెయిల్ ఇప్పుడు సందర్భానికి తగినట్లుగా చాలా మెరుగైన సెర్చ్ సజెషన్స్ కూడా ఇస్తోంది. కాంటాక్ట్స్ కోసం వెతుకుతున్నప్పుడు గూగుల్ మొదటి పేర్లు, ఈమెయిల్ అడ్రస్సులు చూపిస్తోంది. ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉంటే, Gmail లో మీరు ఎవరితో ఎక్కువ సంభాషిస్తున్నారో పరిశీలించి, వారి పేరును పైన చూపుతుంది. అలా అద్భుతంగా ఈ సెర్చ్ సజెషన్స్ అనేవి మెరుగుపడ్డాయి. ఇవన్నీ కూడా అప్‌కమింగ్ యాప్ అప్‌డేట్ల ద్వారా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu