యూజర్ల భద్రతకు గూగుల్‌ పెద్ద పీట !


యూజర్ల భద్రతకు గూగుల్‌ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం యూజర్లు యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో యాప్‌ డెవలపర్‌ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. యాప్‌ డెవలపర్స్‌ అందించిన సమాచారాన్ని గూగుల్‌ తనిఖీ చేసి ఆ సమాచారాన్ని ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచుతుంది. యాప్‌ నిర్వాహకులు యూజర్ల డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. జులై 20 నుంచి డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని గూగుల్‌ ప్రకటించింది.

Post a Comment

0 Comments