Ad Code

సోనీ నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్ టీవీ !


సోనీ కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్‌ Smart Tvని దేశీయ  మార్కెట్లో విడుదల చేసింది. Sony XR OLED A80K TV సిరీస్ పేరుతో వస్తున్న ఈ మోడల్‌ 55, 65, 77 అంగుళాల సైజుల్లో మూడు వేరియంట్లలో విడుదలైంది. ప్రస్తుతం సోనీ కంపెనీ నుంచి భారత్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడల్‌ బాగా ఖరీదైనది మరియు టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ టీవీ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ ఆర్ తో వస్తోంది. ఇది డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు, డాల్బీ విజన్ ఫార్మాట్ హెచ్‌డీఆర్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ టీవీ (3840x2160-pixel) రిసొల్యూషన్‌తో 77 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ OLED స్క్రీన్‌తో వస్తోంది. దీనికి కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్ ను అందిస్తున్నారు. తద్వారా మెరుగైన, అనుకూలమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుంది. డాల్బీ విజన్, HDR10 మరియు HLG ఫార్మాట్‌లతో అధిక డైనమిక్ రేంజ్ కంటెంట్‌కు సపోర్ట్ కలిగి ఉంటుంది. అద్భుతమైన సౌండ్ అనుభూతిని పొందేందుకు.. ఈ టీవీకి Dolby Atmos మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ ఫార్మాట్‌లకు కూడా మద్దతు ఉంది. అంతేకాకుండా, Netflix అడాప్టివ్ కాలిబ్రేటెడ్ మోడ్ వంటి ఇతర ఫార్మాట్‌లు మరియు మరిన్ని మెరుగైన ఫీచర్‌లకు కూడా మద్దతు ఉంది. A80K సిరీస్ Android TV సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రధాన స్ట్రీమింగ్ సర్వీస్‌లతో సహా మరిన్ని కీలకమైన యాప్‌లకు సంబంధించి సపోర్ట్ కలిగి ఉంది. ఇంకా గూగుల్ క్రోమ్ కాస్ట్‌తో పాటు, ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను కనెక్టక్ష చేయడానికి యాపిల్ ఎయిర్ ప్లే 2, హోం కిట్ సపోర్ట్ కలిగి ఉంది. రిమోట్ ద్వారా గూగుల్ అసిస్టెన్స్ వినియోగించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. సౌండ్ విషయానికొస్తే, Sony A80K సిరీస్ అకౌస్టిక్ సర్‌ఫేస్‌ ఆడియో మరియు XR సరౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంది. 60W సౌండ్‌ అవుట్‌పుట్ అందిస్తుంది. ఆటో లో-లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) మరియు ఆటో గేమ్ మోడ్ వంటి గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఈ మోడల్ టీవీలు సైజుల ఆధారంగా మూడు వేరియంట్లలో లభిస్తున్నాయి. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 77 అంగుళాలు ఇలా మూడు రకాలుగా లభిస్తున్నాయి. 65 అంగుళాల వేరియంట్ ధర రూ.2,79,990 గా నిర్ణయించారు. కాగా, 77-అంగుళాల వేరియంట్ ధర భారతదేశంలో రూ.6,99,900 గా నిర్ణయించారు. ఈ రెండూ ఇప్పుడు భారతదేశంలోని సోనీ సెంటర్ స్టోర్‌లు, ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు మరియు ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 55-అంగుళాల వేరియంట్ ధర ఇంకా నిర్ణయించబడలేదు మరియు భారతదేశంలో త్వరలో విక్రయించబడుతుందని కంపెనీ పేర్కొంది. కాగా, ఇది భారత్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడల్‌ బాగా ఖరీదైనది మరియు టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu