Ad Code

వాట్సాప్ లో ఫ్లాష్ కాల్స్?


వాట్సాప్ యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరొక సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అయితే మాములుగా మనం వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి అనుకుంటే వెరిఫికేషన్ అడుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ కాలంలోనే మొదట మన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయగా ఆ తర్వాత ఓటీపీ వస్తే అప్పుడు లాగిన్ అవుతూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు సిగ్నల్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ ఓటీపీలు సరిగ్గా రాకపోవడం వల్ల శ్రమ పడుతూ ఉంటారు. ఇది ఇకపై శ్రమ లేకుండా ఫ్లాష్ కాల్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇదే విషయాన్ని వాట్సాప్ గురించి సమాచారాన్ని అందించే వాబిటాఇన్ఫో తెలిపింది.. అయితే త్వరలోనే ఈ వాట్సాప్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈజీగా, వేగంగా అకౌంట్ లాగిన్ కావచ్చు. ఈ ఫ్లాష్ కాల్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓటిపిని ఎంటర్ చేయాల్సిన పని లేదు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి కూడా రాకున్నప్పటికీ లాగిన్ పూర్తవుతుంది. యూజర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కు వాట్సాప్ మిస్డ్ కాల్ ఇస్తుంది. ఇక అదే నెంబర్ పై వాట్సాప్ లాగిన్ చేస్తున్నట్టు ధృవీకరణ చేసుకొని లాగిన్ పూర్తి అవుతుంది. ఈ కొత్త విధానంతో లాగిన్ వేగంగా జరిగిపోతుంది. అయితే దీనికంటే ముందు వాట్సాప్ కాల్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేసేందుకు అడిగిన అన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu