Ad Code

పేలుళ్లపై ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు నోటీసులు !


దేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌తో పాటు ఫోర్ వీలర్ వాహనాల్లో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలలో చాలా మంది వాహనదారులు గాయపడితే కొందరు చనిపోయారు కూడా. ఈ సంఘటనలపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు అనేకమంది ఎలక్ట్రిక్ వాహనదారులు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కి అనేక ఫిర్యాదులు చేశారు. ఈ రెగ్యులేటర్ అథారిటీ వారి ఫిర్యాదుల మేరకు ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారుచేసే నాలుగైదు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. CCPA ఈ విషయాన్ని మంగళవారం రోజు వెల్లడించింది. ఈవీ కంపెనీలకు తమ నోటీసులకు స్పందించిన వెంటనే ఈ అంశంపై విచారణను ప్రారంభిస్తుందని CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలలో సంభవిస్తున్న పేలుళ్లకు గల కారణాలను వివరించాలని CCPA కోరుతోందని ఖరే చెప్పారు. వారిపై CCPA ఎందుకు చర్య తీసుకోకూడదో కూడా కంపెనీలు చెప్పాలని రెగ్యులేటర్ కోరినట్లు నిధి ఖరే వెల్లడించారు. ఈ సంఘటనల గురించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కి కూడా సమాచారం అందించామని ఆమె తెలిపారు.డీఆర్డీఓ చేసిన పరిశోధనలో దాదాపు అన్ని EV అగ్నిప్రమాదాలలో బ్యాటరీ సెల్‌లలో లోపాలు, బ్యాటరీ డిజైన్‌లో లోపాలే కారణమని తేలింది. ఒకినావా ఆటోటెక్, ప్యూర్ EV, జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓలా ఎలక్ట్రిక్, బూమ్ మోటార్స్ వంటి ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లోయర్-గ్రేడ్ మెటీరియళ్లను ఉపయోగించాయని డీఆర్డీఓ వెల్లడించింది. ఏప్రిల్‌లో ఆ కంపెనీల ఈ-స్కూటర్లు పేలడంతో గత నెలలో CCPA ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్‌కు నోటీసులు పంపింది. బ్యాటరీ సమస్యల కారణంగా వాహనాలు అగ్నికి దగ్ధమవుతున్న నేపథ్యంలో అన్ని ఈవీ ద్విచక్ర వాహనాల కంపెనీలకు షో-కాజ్ నోటీసులు అందజేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత వారం పార్లమెంట్‌లో తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈవీ తయారీ సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నోటీసులకు EV కంపెనీలు ఇచ్చే రెస్పాన్స్‌ల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఏప్రిల్‌లో ఆయా కంపెనీల ఈ-స్కూటర్‌లు పేలడంతో గత నెలలో CCPA ప్యూర్ EV, బూమ్ మోటార్స్‌కు నోటీసులు పంపింది. కొంతకాలం క్రితం బ్యాటరీలు, బ్యాటరీ పార్ట్స్, సంబంధిత వ్యవస్థలకు భద్రతా ప్రమాణాలను సూచించడానికి మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించనుంది. EV అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో దర్యాప్తు కమిటీ అందించిన ప్రాథమిక ఫలితాల్లో సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆ ఫలితాల ప్రకారం, దేశంలో అగ్ని ప్రమాదాలకు గురైన దాదాపు అన్ని ఎలక్ట్రిక్ బైక్స్‌(Bikes)లో బ్యాటరీ సెల్స్‌ లేదా డిజైన్‌లో సమస్యలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu