Ad Code

ట్విట్టర్ డీల్ నుంచి వైదొలిగిన ఎలాన్ మస్క్


ట్విట్టర్ ను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.  యూ టర్న్ తీసుకోవడానికి కారణం ట్విట్టర్ లోని ఫేక్ అకౌంట్లే. ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. నకిలీ లేదా స్పామ్ ఖాతాల సంఖ్యలో 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే, తాను ఈ డీల్ నుండి వెనక్కి తగ్గుతానని గతంలోనే ప్రకటించాడు. ఫేక్ అకౌంట్స్ వల్ల సోషల్ మీడియా వేదిక దుర్వినియోగానికి గురవుతుందని ఆయన భావిస్తున్నారు. ట్విట్టర్ తన స్పామ్ ఖాతాలను తక్కువగా చూపుతోందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ ఆటోమేటెడ్ ఖాతాలు, తప్పుడు సమాచారం, మోసాలు జరిగేందుకు ఆజ్యం పోస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం సమస్యపై, ప్రతిరోజూ 1 మిలియన్ స్పామ్ ఖాతాలను ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేస్తున్నామని ట్విట్టర్ ఇప్పటికే తెలిపింది. అయినప్పటికీ మస్క్ ఈ వివరణతో ఏకీభవించలేదు. పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒప్పంద నిబంధనలు ఉల్లంగించారని మస్క్ ఆరోపించారు. మరోవైపు మస్క్ నిర్ణయంపై లీగల్ గా ఫైట్ చేస్తామని ట్విట్టర్ ప్రకటించింది. విలీన ఒప్పందాన్ని అమలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ లో 44 బిలియన్ డాలర్ల ప్రతిపాదనతో వచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu