Ad Code

షావోమి హోమ్ థియేటర్!


దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ షావోమి అతి తక్కువ ధరల్లో అదిరిపోయే స్మార్ట్ హోమ్ అప్లియన్సెస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఒక స్మార్ట్ స్పీకర్ తీసుకొచ్చింది. దానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ స్పీకర్‌ (Smart Speaker)ను ఐఆర్ కంట్రోల్ (IR Control) అనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో లాంచ్ చేసింది. స్మార్ట్ (Smart)హోమ్ కంట్రోల్ సెంటర్, బ్యాలెన్స్‌డ్ సౌండ్ ఫీల్డ్, LED క్లాక్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో పరిచయం చేసిన ఈ స్మార్ట్ స్పీకర్ ధరను కేవలం రూ.4,999గా నిర్ణయించింది. ఇందులో బిల్ట్-ఇన్ స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ 5.0, బ్రహ్మాండమైన ఎక్స్‌రియన్స్ అందించే 1.5 అంగుళాల మోనో స్పీకర్‌ ఉన్నాయి.  స్మార్ట్ స్పీకర్ విత్ IR కంట్రోల్‌ (Smart Speaker With IR Control)ని మీరు Mi.com, Mi Homes, Flipkart.com, రిటైల్ స్టోర్లలో రూ. 4,999కి సొంతం చేసుకోవచ్చు. లాంచ్ సందర్భంగా షావోమి ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా(India)లోని టాప్ 3 స్మార్ట్ స్పీకర్ బ్రాండ్‌లలో ఒకటిగా తమ కంపెనీ నిలుస్తుందన్నారు. తమ వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యతలపై మంచి అవగాహన ఉందని, అందుకే ఈ స్పీకర్ తీసుకొచ్చామని తెలిపారు. షావోమి స్మార్ట్ స్పీకర్ అడాప్టివ్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో LED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే రూమ్ లోని వెలుతురుకు అనుగుణంగా అడ్జస్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ స్పీకర్‌ను అలారంలా కూడా ఉపయోగించవచ్చు. అలారం సెట్ చేసేటప్పుడు యూజర్లు తమకిష్టమైన పాటలు, సింగర్స్ సాంగ్స్, సీన్స్ లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ 360-డిగ్రీల సరౌండ్ సౌండ్‌ సిస్టమ్‌తో యూజర్లకు మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. షావోమి స్మార్ట్ స్పీకర్‌లో అందించిన IR కంట్రోల్ (IR Control) టీవీ, ఏసీ, ఫ్యాన్ వంటి గృహోపకరణాలను వాయిస్‌తో రిమోట్ కంట్రోల్ చేస్తుంది. IR రిమోట్ కంట్రోలర్లకు సపోర్ట్ చేసే అన్ని గృహోపకరణాలను కంట్రోల్‌ చేయడానికి ఈ స్పీకర్ లోని IR సెన్సార్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. IR డివైజ్‌లను Xiaomi Mi Home యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. స్పీకర్ గూగుల్ అసిస్టెంట్‌తో వస్తుంది. దీని సహాయంతో ఐఆర్ కంట్రోల్ ద్వారా టీవీ, ఏసీ, ఫ్యాన్స్, లైట్ వంటి నాన్-స్మార్ట్ డివైజ్‌లను ఆన్/ఆఫ్ చేయవచ్చు. ఏసీ టెంపరేచర్ పెంచొచ్చు. అలానే ఇంకా మరిన్ని కంట్రోల్స్‌ కూడా జస్ట్ మాటలతో పూర్తి చేయవచ్చు. ఈ స్పీకర్ సాయంతో 10 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని డివైజ్‌లను యూజర్లు రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు. స్మార్ట్ హోమ్ అనుభవాన్ని పొందడానికి వినియోగదారులు షావోమి హోమ్ యాప్‌, గూగుల్ హోమ్ యాప్‌ ద్వారా సెటప్ చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ కలర్ వేరియంట్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు https://mobile.mi.com/in/xiaomi-smart-speaker-ir-control విజిట్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu