Ad Code

డోర్‌ డ్యాష్ పేమెంట్ గేట్‌వే లోపంతో ఉచితంగా ఆర్డర్స్ !


సాఫ్ట్‌వేర్‌తో నడిచే ఏ సర్వీస్ అయినా అప్పుడప్పుడు చిన్నచిన్న సమస్యలు తలెత్తడం మామూలే. అమెరికాలో కూడా ఇలాంటిదే జరిగింది.  అమెరికాలో డోర్‌ డ్యాష్  పేరుతో ఫుడ్ డెలివరీ యాప్ ఒకటి ఉంది. ఈ యాప్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా వందలాది మంది ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫుడ్, డ్రింక్స్ తెప్పించుకున్నారు. జూలై 7న ఇదంతా జరిగింది. డోర్‌ డ్యాష్ కస్టమర్లు ఎప్పట్లాగే ఫుడ్ ఆర్డర్ చేద్దామని ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేస్తే అన్ని ఆర్డర్లు ఉచితంగా ప్లేస్ అవుతున్నాయి. అంతే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మిగతా కస్టమర్లకు కూడా తెలియడంతో ఆర్డర్ల మీద ఆర్డర్లు చేశారు. ప్రముఖ రెస్టారెంట్లకు కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్ వచ్చాయి. తాము చేసిన ఆర్డర్ల గురించి సోషల్ మీడియాలో కస్టమర్లు పోస్టులు కూడా చేశారు. పేమెంట్ గేట్‌వేలో వచ్చిన సమస్య కారణంగా డోర్‌ డ్యాష్ కస్టమర్లు ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. పేమెంట్ పేజీ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. డోర్‌ డ్యాష్ పేమెంట్ గేట్‌వేలో ఉన్న లోపాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. వేల డాలర్ల ఆర్డర్స్‌ని ఉచితంగా ప్లేస్ చేశారు. ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. అటు రెస్టారెంట్లలో కూడా వందల సంఖ్యలో పార్శిళ్లు డెలివరీ సిద్ధమయ్యాయి. ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. డోర్‌ డ్యాష్ పేమెంట్ గేట్‌వేలో ఉన్న సమస్యను అవకాశంగా తీసుకొని ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేసినవారంతా, ఆ సంస్థ ఉద్యోగులకు టిప్స్ ఇవ్వాలని ఎందుకు అనుకోవట్లేదని కొందరు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇక ఇంకొందరు ఫన్నీగా మీమ్స్ షేర్ చేశారు. ఇలాంటి ఆర్డర్‌ల వల్ల నష్టపోయిన వ్యాపారులకు పరిహారం అందేలా చూస్తామని డోర్‌ డాష్ అధికార ప్రతినిధి మీడియాకి తెలిపారు. ఇలాంటి ఆర్డర్లను గుర్తించి రద్దు చేశామని, ఆర్డర్లు తీసుకొని ఫుడ్ డెలివరీ చేసిన వ్యాపారులకు పరిహారం చెల్లిస్తామని అన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడం మామూలే. ఈ సమస్యలతో ఎక్కువ ధర ఉన్న వస్తువుల్ని తక్కువ ధరకే కొనడం లేదా ఉచితంగా ఆర్డర్ చేయడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu