Ad Code

ఇండియాలో గూగుల్ "స్టార్టప్‌ స్కూల్‌"


స్టార్టప్ ల హబ్ గా ఇండియా మారుతోంది. అయితే చాలా స్టార్టప్ లకు ప్రారంభ దశలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ముందుకు వచ్చింది. స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మన దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది. స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు అందిస్తారు. కొత్తగా ఇంటర్నెట్‌కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన చేస్తారు. కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు ఇస్తారు. ఈ అంశాలతో పాటు మొదలైన వాటిలో ట్రైనింగ్ ఇస్తారు. స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల స్టార్టప్ లు చతికిల పడుతున్నాయి. ఈ అంశాల్లో ఎలా వ్యవహరించాలనేది అవగాహన కల్పిస్తారు. తద్వారా అవి నిలదొక్కుకునేందుకు నైతిక స్థైర్యం ఇస్తారు. దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ , బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu