Ad Code

స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగం విఫలం !


టెక్సాస్‌లోని బోకా చికా నుంచి  సూపర్‌ హెవీ బూస్టర్ రాకెట్ పరీక్షిస్తుండగా అది ఒక్కసారగా పేలి, అంచనాలను తలకిందులు చేసింది. ఈ ఏడాది అంతరిక్షంలోని భూ కక్ష్యలో స్టార్‌షిప్‌ను పంపాలనే మస్క్ లక్ష్యానికి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ హెవీ బూస్టర్ 7 ప్రోటోటైప్ పేలడంతో ఎలన్‌ మాస్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్స్ గ్రహంపై మనుషుల మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్‌ మాస్క్‌స్పేస్‌ ఎక్స్‌ బూస్టర్ రాకెట్లను తయారు చేస్తోంది. తక్కువ ఖర్చుతో స్పేస్‌లో మానవుడు అడుగుపెట్టేలా స్టార్‌ షిప్‌ స్పేస్‌ రాకెట్‌ను తయారు చేశారు. సోమవారం దాన్ని ప్రయోగించగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన దృష్యాలను నాసా స్పేస్‌ ఫ్లైట్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ వీడియోలో దట్టమైన పొగలతో, మంటలు రావడం కనిపిస్తుంది. 33 ఇంజిన్‌లతో తయారు చేసిన రాకెట్‌ను ఈ ఏడాది చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా తయారు చేసిన 394 అడుగుల సూపర్‌ హెవీ బూస్టర్‌ 7 ప్రోటో టైప్‌ను టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్‌ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ బూస్టర్‌ ఒక్కసారిగా పేలి ముక్కలైంది. దీనిపై ఎలన్‌ మాస్క్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. రాకెట్‌ ఎందుకు పేలిందో స్పష్టమైన కారణం ఇంకా తెలియదు. రాకెట్‌ పేలుడు నష్టాన్ని స్పేస్‌ ఎక్స్‌ టీం అంచనా వేస్తుందని ఆయన ఈ సందర్భంగా ట్వీట్‌ చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu