మెటా కంపెనీకి చెందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లకు మరిన్ని ఫీచర్లు అందించనుంది. సబ్‌స్క్రైబర్లతో క్రియేటర్‌లు కనెక్ట్ అవ్వడానికి వీలుగా సబ్‌స్క్రైబర్ చాట్స్, ఎక్స్‌క్లూజివ్ పోస్ట్స్ వంటి మరిన్ని టూల్స్ అందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలియజేసింది. క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత ఆదాయాన్ని అందుకుంటూనే, తమను ఫాలో అయ్యే సబ్‌స్క్రైబర్లతో క్లోజ్ రిలేషన్ ఏర్పరచుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందుకోసం ఈ సంవత్సరం ప్రారంభంలో సబ్‌స్క్రిప్షన్‌లను పరీక్షించడం ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. సబ్‌స్క్రైబర్లతో సులువుగా కనెక్ట్ అయ్యే సదుపాయం ఇన్‌స్టాగ్రామ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో.. 'యూఎస్ అంతటా సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్‌ను అందజేశాం. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. ఆదాయం పొందుతూనే, కంటెంట్‌లో సబ్‌స్క్రైబర్లను భాగస్వామ్యం చేయడం, వారిని ప్రోత్సహించడం, వారికి మరింత విలువను అందిస్తాయనే అభిప్రాయాలను విన్నాం. మీ సబ్‌స్క్రైబర్లతో కనెక్ట్ అవ్వడానికి కొత్త మార్గాలను రూపొందిస్తున్నాం. ఇందులో సబ్‌స్క్రైబర్ చాట్‌లు, శాశ్వతమైన, ప్రత్యేకమైన కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి కొత్త మార్గాలు, మీ ప్రొఫైల్‌లో ప్రత్యేకమైన ట్యాబ్ ఉన్నాయి.' అని తెలిపింది. క్రియేటర్లు ప్రస్తుతం సబ్‌స్క్రైబర్లతో కనెక్ట్ అవ్వడానికి, వారికి ఆసక్తి ఉన్న విషయాలను చర్చించడానికి, వారి అత్యుత్తమ లైఫ్ హ్యాక్‌లను పంచుకోవడానికి లేదా సబ్‌స్క్రైబర్లను ఒకచోట చేర్చుకోవడానికి గరిష్టంగా 30 మంది వ్యక్తులతో సబ్‌స్క్రైబర్ చాట్‌లను క్రియేట్ చేయవచ్చు. చాట్‌లు ఇన్‌బాక్స్ లేదా స్టోరీ నుంచి క్రియేట్ అవుతాయి. 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా ఎండ్ అవుతాయి, కాబట్టి క్రియేటర్లు బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయవచ్చు. సబ్‌స్క్రైబర్లతో ఎప్పుడు, ఎలా ఎంగేజ్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. సబ్‌స్క్రైబర్లు జాయిన్ చాట్ స్టిక్కర్ నుంచి చాట్‌లలో చేరవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ స్టిక్కర్ తరహాలోనే ఉంటుంది. ఇన్‌బాక్స్‌లోని కొత్త సబ్‌స్క్రైబర్ ట్యాబ్ సబ్‌స్క్రైబర్లతో చాట్‌లను సులభంగా నిర్వహించడానికి, క్రియేటర్లకు వీలు కల్పిస్తుంది. దీంతో క్రియేటర్స్ మెసేజ్ ఎప్పుడూ మిస్ కారు, అదే విధంగా సులువుగా రెస్సాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్పెషల్ కంటెంట్‌ను పోస్ట్‌లు లేదా రీల్స్‌గా పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాబట్టి సబ్‌స్క్రైబర్లు కూడా కామెంట్‌లు చేసే వీలు ఉంటుంది. వారి కోసం సృష్టించిన కంటెంట్‌ను ఆస్వాదించడానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. క్రియేటర్లు ఇప్పుడు సరికొత్త కంటెంట్ ప్రపంచాన్ని సృష్టించగలరని మెటా తెలిపింది. సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి వెంటనే పోస్ట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అందుతుందని పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్‌కు కొత్త టూల్స్ లాంచ్..!
0
July 15, 2022
Tags