Ad Code

అందుబాటులోకి ఎల్జీ రోలబుల్ టీవీలు !


దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోలబుల్ టీవీలను ఎల్జీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ టీవీలు కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో ఈ టీవీ ధర విని షాకైన వినియోగదారులు, ప్రస్తుతం దీని ఫీచర్లు చూసి అవాక్కవుతున్నారు. ఈ LG Signature OLED R టీవీలు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ మించి ఇది రోలబుల్ (మడవగలిగే) టీవీ కావడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీవీలు న్యూ దిల్లీలోని రిలయన్స్ డిజిటల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ రోలబుల్ టీవీలో ప్రధానంగా ఆకట్లుకునే అంశం ఏంటంటే మ్యూజిక్ ఒక్కటే వినాలనుకున్నప్పుడు టీవీని రోలబుల్ బాక్సులోకి రోల్ చేయడం ద్వారా సౌండ్ సిస్టమ్‌గా మర్చుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఈ టీవీలో దృశ్యాలు రియల్ లైఫ్ అనుభూతిని కలిగిస్తాయి. అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ టీవీ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే. దీని ధరను కంపెనీ రూ.75లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఈ టీవీ గురించి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ హోం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ రోలబుల్ టీవీ నిజంగా లగ్జరీ ప్రొడక్ట్ అని తెలిపారు. ఈ టీవీ వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. అదేవిధంగా టీవీ మార్కెట్‌లో ఎల్‌జీ సంస్థ పాత్రను మరోసారి ఆయన ప్రస్తావించారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ టీవీ కి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. LG Signature OLED R టీవీ 65 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. దీనికి సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాలజీని ఉజయోగించారు. దీనికి α9 Gen 4 (నాలుగో జనరేషన్‌) AI ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఇక సౌండ్ విషయానికి వస్తే అద్భుతమైన యూజర్ అనుభూతి కోసం డాల్బీ ఆట్మోస్ స్పెషల్ ఫీచర్ కల్పిస్తున్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం దీనికి డాల్బీ విజన్ ఐక్యూ ఫెసిలిటీ కల్పించారు. అంతేకాకుండా సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాలజీ ఈ టీవీ ప్రధాన ఆకర్షణ. అద్భుతమైన గేమింగ్ అనుభూతి పొందేలా ఈ టీవీ 4K 120fps and G-Sync సపోర్టుతో తయారుచేసినట్లు సంస్థ వెల్లడించడం విశేషం. ఈ టీవీ అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లను కలిగి ఉంది. దీని పనితీరు 2020 నుండి హై-ఎండ్ OLEDల LGల లైనప్‌ని పోలి ఉంటుంది. రోల్ చేయగల టీవీ HDMI 2.1, 4K రిజల్యూషన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ వంటి HDR ప్రమాణాలకు మద్దతు, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, Amazon Alexa/ Google Assistant సపోర్ట్ మరియు Dolby Atmos ఆడియో వంటి ఇతర హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తుంది. రోల్ చేయదగిన OLED TV R తన జీవితకాలంలో కనీసం 50,000 సార్లు చుట్టవచ్చు అని  తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu