Ad Code

సూపర్ ఎర్త్ ను గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు


భూమిని పోలి ఉన్న మరో 'సూపర్ ఎర్త్'ను పరిశోధకులు కనుగొన్నారు. కోటాను కోట్ల జీవరాశులతో పాటు మనుషులు కూడా నివసిస్తున్న ఈ భూమిలాంటి మరో గ్రహం ఈ అనంత విశ్వంలో ఉండకపోతుందా? అనే ఆలోచనతో పరిశోధకులు ఈ విశ్వాన్ని అత్యంత శక్తివంతమైన టెలీస్కోపులతో జల్లెడపడుతున్నారు. భూమిని పోలినటువంటి మరే ఇతర గ్రహాలైనా విశ్వంలో ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవడానికి చేస్తున్న ముమ్మరం ప్రయత్నాల్లో భాగంగా మన భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని నాసా పరిశోధకులు తాజాగా గుర్తించారు. హవాయిలోని జపాన్ యొక్క నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ సుబారు టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ సూపర్ ఎర్త్ ను కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ సూపర్ ఎర్త్ సూర్యుడికి భూమి మధ్య ఉన్న దూరం కంటే కేవలం 0.05 రెట్లు ఎక్కువ దూరంలోనే ఈ గ్రహం తన నక్షత్రంతో ఎడంగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు. ఆ గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉండి ఉండొచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీరు ఉంటే జీవం ఉన్నట్లేగా..అందుకే నీటితో పాటు ఆ సూపర్ ఎర్త్ పై జీవం ఉండటానికి కూడా పరిస్థితులు దోహదపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. భూమి కంటే నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఉన్న ఈ గ్రహం అక్కడే ఉన్న ఓ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమణం చేయడానికి 10.8 రోజులు పడుతుందట!.


Post a Comment

0 Comments

Close Menu