Ad Code

షావోమీ సీవీ 2 స్మార్ట్ ఫోన్ విడుదల


షావోమీ సీవీ 2 స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. వీటిలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగా (సుమారు రూ.27,000) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్లుగానూ (సుమారు రూ.28,500) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (సుమారు రూ.28,500) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఎప్పుడు జరుగుతుందో తెలియరాలేదు. షావోమీ 12 లైట్ 5జీ ఎన్ఈ లేదా షావోమీ 13 లైట్ బ్రాండింగ్‌లతో గ్లోబల్‌గా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షావోమీ సీవీ 2 పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.72 సెంటీమీటర్లుగానూ, బరువు 171.8 గ్రాములుగానూ ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌లను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హీట్ డిస్‌పాషన్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అందించారు.

Post a Comment

0 Comments

Close Menu