Ad Code

డిమాండ్ లేకపోవడంతో ప్రొడక్షన్‌లో కోత !


ఐఫోన్ 14 సేల్స్ డిమాండ్ తగినంతగా లేకపోవడంతో న్యూ ఐఫోన్ ప్రొడక్షన్ పెంచడంపై కంపెనీ పునరాలోచనలో పడిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఐఫోన్ 14 దాదాపు ఐఫోన్ 13 తరహాలోనే ఉండటంతో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఐఫోన్ 13 కొనుగోలుకే కస్టమర్లు మొగ్గుచూపుతుండటంతో ఐఫోన్ 14కు డిమాండ్ మందగించిందని చెబుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ రూ 20,000 వరకూ డిస్కౌంట్ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ అయిపోయింది. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లోనూ ఐఫోన్ 13కు అనూహ్య డిమాండ్ ఏర్పడటంతో స్టాక్ అందుబాటులో లేని పరిస్ధితి నెలకొంది. అధిక ధరకు న్యూ మోడల్ కొనుగోలు చేసేందుకు బదులు కస్టమర్లు తక్కువ ధరకు దాదాపు అదే డిజైన్‌, ఫీచర్లతో లభిస్తున్న ఓల్డర్ వెర్షన్‌కు మొగ్గుచూపుతున్నారు. ప్రొ మోడల్స్ కాకుండా ఇతర ఐఫోన్ 14 మోడల్స్ తయారీని తగ్గించాలని యాపిల్ ఇప్పటికే సరఫరాదారులను కోరినట్టు తెలిసింది. 9 కోట్ల లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ లక్ష్యంగా గత ఏడాది నిర్ధేశించిన యాపిల్ తాజాగా కేవలం 60 లక్షల ఫోన్ల ప్రొడక్షన్‌కే మొగ్గుచూపుతోందని తెలిసింది. మరోవైపు ఐఫోన్ 14 ప్రొ ప్రొడక్షన్‌ను పది శాతం పెంచాలని ఫాక్స్‌కాన్‌ను యాపిల్ కోరింది. దీంతో కస్టమర్లు ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌ను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు వెల్లడైంది. ప్రొ మోడల్స్‌లో యాపిల్ కొన్ని కీలక మార్పులను చేపట్టడంతో ఈ మోడల్స్‌కు ప్రజల నుంచి డిమాండ్ నెలకొంది.

Post a Comment

0 Comments

Close Menu