Ad Code

వాట్సాప్‌లో అవతార్ ?


వాట్సాప్  యూజర్ల ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. త్వరలోనే 'అవతార్' అనే మరొక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము నిజజీవితంలో ఎలాంటి స్కిన్ టోన్, హెయిర్ స్టయిల్, ఔట్‌ఫిట్స్, యాక్సెసరీలు కలిగి ఉంటారో ఆ లక్షణాలతో ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్లు తమని ప్రతిబింబించేలా ఒక త్రీడీ అవతార్ క్రియేట్ చేసుకొని దానిని స్టిక్కర్‌గా సెండ్ చేసుకోవచ్చు. అలానే ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వాట్సాప్ యూజర్లు తమను పోలిన స్టిక్కర్స్‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి పంపించాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఆ సదుపాయం వాట్సాప్‌లో రాలేదు. అయితే త్వరలోనే ఆ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో  తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ ఫీచర్‌తో మీరు మీ రూపాన్ని బట్టి ఒక అవతార్‌ క్రియేట్ చేసుకుని దానిని వాట్సాప్‌లో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వాట్సాప్ మీ అవతార్‌తో ఏకంగా ఒక స్టిక్కర్ ప్యాక్‌నే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇందులో మీ అవతార్‌ ఏడ్చినట్లు, నవ్వినట్లు, బుంగమూతి పెట్టుకున్నట్లు, ఇంకా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టిక్కర్స్ ఉంటాయని సమాచారం. వాట్సాప్ సెట్టింగ్స్‌లోనే అవతార్‌ను మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్‌ను కాన్ఫిగర్/ క్రియేట్ చేశాక వాట్సాప్ మీరు ఎంచుకున్న కాన్ఫిగరేషన్ ఆధారంగా పర్సనాలైజ్డ్ స్టిక్కర్ ప్యాక్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu