Ad Code

త్వరలో మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ !


షియోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ వచ్చే ఏడాది రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్ అయిన రెడ్‌మీ నోట్ 12 గురించి తాజాగా ఒక కొత్త లీక్ బయటకొచ్చింది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ తో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిప్‌ను తైవాన్ చిప్‌మేకర్ మీడియాటెక్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ డైమెన్సిటీ 1080 అనేది Mali-G68 GPU, 6nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 200MP కెమెరా, HyperEngine 3.0కి సపోర్ట్ ఇస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 4Kకి సపోర్ట్ ఉంది కాబట్టి, నోట్ 12 కూడా 4K వీడియో షూటింగ్ సపోర్ట్‌తో రావచ్చు. రెడ్‌మీ నోట్ 12లో అందించారని చెబుతున్న ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ 778Gకి సమానమైన పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌ను మిడ్-రేంజ్ ఫోన్లలో అందిస్తారు. ఈ ప్రాసెసర్ రూ.25,000 ధర ఉండే ఫోన్లలో కనిపిస్తుంది. అంటే స్నాప్‌డ్రాగన్‌ 778G లాంటి పర్ఫామెన్స్‌తో రెడ్‌మీ నోట్ 12 కూడా ఇంచుమించు ఇదే ప్రైస్‌ రేంజ్‌లో లాంచ్ అవ్వచ్చు. వెనిలా రెడ్‌మీ నోట్ 12 డైమెన్సిటీ 1080తో వస్తే దాని ధర రూ.20-రూ.25 వేలలోపు ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. రెడ్‌మీ నోట్ 12 చిప్ అప్‌గ్రేడ్‌తో AnTuTuలో 520,000 కంటే ఎక్కువ స్కోర్‌ను సాధించిందని సమాచారం. ఈ ఫోన్ అప్‌గ్రేడెడ్ 50MP మెయిన్ లెన్స్‌తో వస్తుందని టాక్. ఈ మెయిన్ లెన్స్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో లెన్స్‌ అందించారని లీక్స్‌ పేర్కొన్నాయి. వెనిలా నోట్ 12 ఫోన్ 4,980mAh బ్యాటరీతో వస్తుందని తెలిసింది. ఈ నోట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu