Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, October 14, 2022

యాపిల్‌కు రూ. 150 కోట్ల జరిమానా విధించిన బ్రెజిల్ కోర్టు


చార్జర్‌ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్‌కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్‌ చెల్లించాలని, రిటైల్‌ బాక్స్‌లో విధిగా చార్జర్‌ను జోడించాలని యాపిల్‌ సంస్థను బ్రెజిల్‌ కోర్టు ఆదేశించింది. బ్రెజిల్‌లో ఐఫోన్లు అమ్మకాలు జరపాలంటే స్మార్ట్‌ఫోన్‌తో పాటు విధిగా చార్జర్‌ అందించాలని స్పష్టం చేసింది. చార్జర్‌ లేకుండానే యాపిల్‌ తన ప్రీమియం డివైజ్‌లను విక్రయిస్తోందని వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులతో కూడిన అసోసియేషన్‌ పిటిషన్‌ ను దాఖలు చేసింది. దానిని విచారిస్తూ సా పాలో స్టేట్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై గత ఉత్తర్వుల తరహాలోనే మరోసారి అప్పీల్‌కు వెళతామని యాపిల్‌ పేర్కొంది. ఇదే అంశంపై ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ యాపిల్‌కు 2.5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు. చార్జర్‌ను కూడా ఆఫర్‌ చేసే వరకూ కంపెనీని బ్రెజిల్‌లో ఐఫోన్లు విక్రయించకుండా నిషేధించారు. ఇదిలా ఉంటే కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగానే చార్జర్‌ను ఫోన్ తో పాటు ఇవ్వడం లేదని యాపిల్‌ చెబుతోంది. చార్జర్‌ లేకుండా స్మార్ట్‌ఫోన్ల విక్రయం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రెజిల్‌ అధికారులు యాపిల్‌ వాదనను తోసిపుచ్చారు. ఫోన్‌ చార్జింగ్‌కు అడాప్టర్‌ అవసరమని, ఇది లేకుండా స్మార్ట్‌ఫోన్‌ పనిచేయదని యాపిల్ ఛార్జర్ ఇవ్వకపోవడం వల్ల దానికి అనదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చార్జర్‌ను కూడా రిటైల్‌ బాక్స్‌లో పొందుపరచి విక్రయాలు జరపాలని యాపిల్‌ను ఆదేశించింది.

No comments:

Post a Comment

Popular Posts