Ad Code

ఇన్ఫినిక్స్ నుంచి 43 వై1 స్మార్ట్ టీవీ విడుదల


ఇన్ఫినిక్స్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి వై1 సిరీస్ లో ఇన్ఫినిక్స్ 43 వై1స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్స్ విభాగంలో మాత్రమే కాకుండా మిగిలిన ప్రోడక్టుల విభాగంలో కూడా మార్కెట్ ను క్రమక్రమంగా విస్తరించుకుంటోంది. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఇన్ఫినిక్స్ 43వై1 స్మార్ట్ టీవీ 43 ఇంచుల డిస్‌ప్లే తో, 300 నిట్స్ పీక్‌ బ్రైట్‌ నెస్ ఉంటుంది. అలాగే డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 20 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ టీవీలో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 లాంటి పాపులర్ ఓటీటీ యాప్స్ అన్నింటికీ ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇన్ఫినిక్స్ 43వై1 రన్ అవుతుంది.  యాప్స్, గేమ్స్‌ కావాలి అనుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu