Ad Code

44 వేల కియా కార్లను రీకాల్ !


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తయారీ ప్లాంట్ ఉన్న కియా కంపెనీ తన తాజా మోడల్ కరెన్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్రమాద సమయంలో కాపాడే ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నాయోమోననే అనుమానంతో చెక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ మోడల్‌ను ఫిబ్రవరిలో మార్కెట్లోకి తీసుకురాగా, ఇప్పుడు దాదాపు 44 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఏమైనా లోపాలు గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేస్తామని వివరించింది. ఇందుకోసం నేరుగా కార్ల యజమానులతోనే సంప్రదిస్తామని పేర్కొంది. ఒకవేళ ఏ కారులోనైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరమని తమ స్టాఫ్ నిర్ణయిస్తే ఆయా కార్ల యజమానులు కియా డీలర్లతో టచ్‌లో ఉండాలని సూచించింది. కాగా, కియా కంపెనీ వినియోగదారుల అవసరాలు, అభిరుచులకనుగుణమైన మోడళ్లను తయారు చేసి తక్కువ సమయంలోనే మార్కెట్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అంతేకాక, పెద్ద ఎత్తున విదేశాలకు కూడా కార్లను ఎగుమతి చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu