Ad Code

4కే క్వాలిటీ వీడియోలు అందరికీ యాక్సెస్ !


యూట్యూబ్ ఆదాయం పెంచుకోవడం కోసం 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్‌ను కేవలం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేనివారికి 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ లభించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా యూట్యూబ్ ఈ ట్రయల్‌ను నిర్వహించింది. దీంతో అనేక మంది యూజర్లు షాక్ అయ్యారు. 4కే క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వచ్చాయని యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో వివరించారు. రెండువారాల పాటు ఈ ట్రయల్ నిర్వహించిన యూట్యూబ్, ఈ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది. ఇక అందరికీ 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ లభిస్తుందని ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేవని, మెంబర్‌షిప్స్ కూడా అవసరం లేదని యూట్యూబ్ ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. అయితే యూట్యూబ్ ఈ ప్రయోగం ఎందుకు చేసింది, ఈ ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితాలేంటీ, యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది, ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికే ఇలా చేసిందా అన్నది తెలియదు. అయితే యూట్యూబ్ ఈ ప్రయోగాన్ని ఆపేసి, యూజర్లు అందరికీ 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ ఇవ్వడం పెద్ద ఊరటే. స్మార్ట్‌ఫోన్ల కన్నా 4కే స్మార్ట్ టీవీల్లో ఎక్కువగా 4కే క్వాలిటీ వీడియోలు చూసేవారు ఎక్కువ. గూగుల్ అకౌంట్ ఉన్నవారు యూట్యూబ్‌లో 4కే క్వాలిటీ వీడియోలు చూడొచ్చు. వీడియో ప్లే చేసినప్పుడు యాడ్స్ రావడం మామూలే. కొంతకాలం 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. 

Post a Comment

0 Comments

Close Menu