గతంలో జియో తక్కువ బడ్జెట్‌లో 4జీ సపోర్ట్ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జియో 5జీ స్మార్ట్ ఫోన్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ ఫోన్ గురించి నెట్టింట పలు ఫీచర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జియో గంగా అనే కోడ్ నేమ్‌గా పిలవనుందని సమాచారం. దీపావళి నాటికి జియో 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌వైఎఫ్ కంపెనీ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోన్న వార్తల ప్రకారం ఈ ఫోన్‌ను 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని టాక్. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుందని తెలుస్తోంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. గూగుల్ లెన్స్, ట్రాన్స్‌లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి ఈ 5జి స్మార్ట్ ఫోన్‌ను దీపావళికి లాంచ్ చేస్తారో లేదా చూడాలి.దేశంలోని ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో ఇంకా అలాగే ఎక్కువ ఫీచర్స్ తో ఈ 5జిస్మార్ట్ ఫోన్ రానుంది. ఈ ఫోన్ కోసం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Search This Blog
Saturday, October 1, 2022
జియో 5G ఫోన్ ఫీచర్స్ !
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment