Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, October 2, 2022

ఫ్లిప్‌కార్ట్ లో 80 శాతం డిస్కౌంట్లు !


సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహించగా, అమెజాన్ లో సెప్టెంబర్ 23న ప్రారంభమైన సేల్ ఇంకా ముగియలేదు. ఈ సేల్స్ లో కనీవనీ ఎరగని ఆఫర్లను ప్రకటించడంతో వినియోగదానులు భారీగా కొనుగోళ్లను నిర్వహించారు.  ఇంత తగ్గింపు ఆఫర్లు ఇప్పట్లో ఇక ఉండవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ తరుణంలో మరో సేల్ ను ప్రకటించింది ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఫ్లిప్ కార్టు. దసరా సందర్బంగా ఈ నెల 5వ తేదీ నుంచి 8 వరకు BIG DUSSEHRA SALE 2022 ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ప్రకటించింది.  బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో షాపింగ్ చేయలేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. దసరా సేల్ లో అందించే అద్భుతమైన ఆఫర్లని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఫ్లిప్ కార్ట్ కోరింది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ విభాగంలో 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని తెలిపింది. టీవీలు పై సైతం 75 శాతం తగ్గింపులు ఉంటాయని వెల్లడించింది.  4K అల్ట్రా హెచ్డీ టీవీలు రూ.17,249 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఇంకా వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. ఏసీలు 55 శాతం తగ్గింపు ధరతో ప్రారంభమవుతాయని తెలిపింది. ఇంకా టీవీల రూ.7199 నుంచి ప్రారంభం అవుతాయని సేల్స్ పేజీలో ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.  ఇంకా ఫ్యాషన్ వస్తువులపై 60-80 శాతం తగ్గింపులు ఉంటాయని స్పష్టం చేసింది. బ్యూటీ, ఫుడ్, టాయ్స్ వస్తువులు రూ.99 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. హోం, కిచెన్ వస్తువులు రూ.99 ప్రారంభ ధరతో లభిస్తాయని పేర్కొంది 

No comments:

Post a Comment

Popular Posts