Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, October 10, 2022

క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్ వాడకండి !


క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్ కాని వాడే భారతదేశ యూజర్లు ప్రమాదంలో ఉన్నారని ఎసెట్ అనే సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ రెండు వాట్సాప్‭ల డేటాను లీక్ చేసే అవకాశం ఉందని, మెసేజ్ లు  చదువుతున్నారని, వాట్సాప్‭లను హ్యాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్‭లో లేని ఈ వాట్సాప్‭లు యాంటీ-వైరస్ ధాటికి సులువుగా గురవుతున్నాయని, వైరస్ నుంచి వాటి నుంచి జాగ్రత్త పడాలంటే క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్ తొలగించడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్‭లలో సెక్యూరిటీ సరిగా ఉండదని, స్పైవేర్ వంటి హానికరమైన వైరస్‭లను అడ్డుకునే సామర్థ్యం ఉన్న సాఫ్ట్‭వేర్ ఇందులో ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే అనధికారిక వాట్సాప్ క్లోన్ యాప్‭ల నిషేధంపై మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతోంది. ఇలాంటి యాప్ ద్వారా వాట్సాప్ వాడితే వారి అకౌంట్‭ను పూర్తిగా నిలివేస్తామని మెటా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. ఆండ్రాయిడ్ ఆధారిత క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్‭లు ఇంటర్నెట్‭లో వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ట్రోజన్స్ కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ట్రోజన్లు చట్టపరమైనవి కావు. కానీ ఇవి చట్టబద్ధమైనవన్నట్లుగా నెటిజెన్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతో అసలు విషయం తెలియక నెటిజెన్లు వీటిని ఉపయోగించి, స్పైవేర్ బారిన పడుతున్నారు. ఈ యేడాది ఆండ్రాయిడ్ థ్రెట్ ఇండియాలో 9.5 శాతానికి పెరిగింది. కాబట్టి.. గూగుల్ ప్లేలో ఉన్న యాప్‭లనే ఉపయోగించి స్పైవేర్ నుంచి రక్షణ పొందమని నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

Popular Posts