రిలయన్స్ జియో తన యూజర్లు రీచార్జ్ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లలో డిస్నీ+ హాట్ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి జియో అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని ప్లాన్‌లో ఉన్న ఓటీటీ ఆఫర్‌ను చూపించడం లేదు. కస్టమర్లు ఇప్పుడిక డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ పొందాలంటే కేవలం రెండు ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.1499, రూ.4199 రీచార్జ్‌తో మాత్రమే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. జియో యూజర్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడాలంటే ప్రత్యేక రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఓటీటీని తొలగించిన ప్లాన్‌లలో యూజర్లు ఇది వరకే కొనుగోలు చేసి ఉంటే దాని దాని వ్యాలిడిటీ తేదీ వరకు డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉంటుంది. రూ. 1,499 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రూ.4,199 ప్లాన్‌లో.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఇతర ప్లాన్ రూ. 4,199 రీఛార్జ్ ప్యాక్. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజువారీగా 3GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రెండు ప్లాన్‌లు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది.
:
No comments:
Post a Comment