Ad Code

పురుషులు కంటే మహిళలకు జ్ఙానపక శక్తి ఎక్కువ !


ఒక విషయాన్ని ఆలోచించడంలో మగవారి కంటే ఆడవారు ముందుంటారనేది మనకు తెలిసిందే. పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా, చురుకుగా ఉంటుందని నార్వేకు చెందిన పరిశోధకులు తేల్చారు. ఇదే సమయంలో మహిళలు 50 ఏండ్ల క్రితం నాటి మాటల్ని కూడా గుర్తుంచుకోగలరని వెల్లడించారు. మెదడు చురుకుదనం, ఆలోచనావిధానం, జ్ఞాపకశక్తి సామర్ధ్యంపై నార్వేలోని బెర్గిన్‌ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. వీరు తమ పరిశోధన కోసం పురుషులు, స్త్రీల మానసిక నైపుణ్యాలకు సంబంధించి కొన్నేండ్ల డాటాను సేకరించి విశ్వేషించారు. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డాటాను తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన డాటా రీసెర్చ్‌లో మహిళలకు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. వీరు వెల్లడించిన అధ్యయన పత్రం ప్రకారం.. మేధో నైపుణ్యాల్లో స్త్రీ, పురుషుల మధ్య తేడా లేదు. స్త్రీల జ్ఞాపకశక్తి కూడా పురుషుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఒక నిర్దిష్ట అక్షరం లేదా సంఖ్యతో ప్రారంభమయ్యే పేర్లు, పదాలను కనుగొనడం, గుర్తుంచుకోవడంలో మహిళలు ముందు వరుసలో ఉంటారు. మహిళల మెదడులోని కార్టెక్స్, లింబిక్ వ్యవస్థలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వారి మెదడు పురుషుల కంటే చురుకుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇదే సమయంలో ముఖాలను గుర్తుంచుకోవడంలో కూడా మహిళలు మెరుగ్గా ఉంటారని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధన వెల్లడించింది. అంతేకాకుండా వాసనలు గుర్తుపెట్టుకోవడం వంటి ఇంద్రియ జ్ఞాపకాలను మహిళలు మరిచిపోరని వీరి అధ్యయనం పేర్కొన్నది.

Post a Comment

0 Comments

Close Menu