Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, October 6, 2022

అత్యంత చౌకైన టాటా ఎలక్ట్రిక్ కారు


టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది, ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలుగా ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కి.మీ ప్రయాణిస్తుంది.  బుకింగ్స్ అక్టోబర్ 10 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ కారు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది.  ఈ కారు 5.7 సెకన్లలో 0 నుండి 60 mph వేగాన్ని చేరుకుంటుందని టాటా పేర్కొంది. దీని 15A సాకెట్‌ను 3.3kW AC ఛార్జర్, 7.2kW AC హోమ్ ఛార్జర్ మరియు DC ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. 15A ఛార్జర్ ద్వారా ఇంట్లో, కార్యాలయంలో లేదా ఎక్కడైనా ఈ కార్ ను ఛార్జ్ చేయవచ్చు Tiago EV మొత్తం ఐదు రంగులలో టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లం, ట్రాపికల్ మిస్ట్ లో అందుబాటులో ఉంది.  ప్రొజెక్టర్ హెడ్‌ల్యాప్‌లు, కాంట్రాస్ట్ రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోఫోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ ORBM ఉన్నాయి. లోపలి భాగంలో, లెదర్ CTS, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్లు ఉన్నాయి.

No comments:

Post a Comment

Popular Posts